Home> క్రీడలు
Advertisement

PAK Vs AFG Highlights: పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్న అప్గాన్.. పాక్‌పై సంచలన విజయం

Afghanistan Beat Pakistan by 8 Wickets: ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్‌ జట్టుకు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. 8 వికెట్ల తేడాతో ఓడించి.. రెండో విజయాన్ని నమోదు చేసుకుని.. పాక్ సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసింది. పాకిస్థాన్‌కు ఇది హ్యాట్రిక్ ఓటమి. 
 

PAK Vs AFG Highlights: పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్న అప్గాన్.. పాక్‌పై సంచలన విజయం

Afghanistan Beat Pakistan by 8 Wickets: వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తోంది. తమను చిన్న జట్టే అని తేలిగ్గా తీసుకున్న జట్లను అలవోకగా ఓడిస్తోంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఓడించి పెను సంచలనం నమోదు చేసిన అఫ్గాన్.. తాజాగా పటిష్ట పాకిస్థాన్‌ను కూడా ఓడించి అన్ని జట్లకు హెచ్చరికలు పంపించింది. ఆదివారం పాక్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 రన్స్ చేసింది. బలమైన బౌలింగ్ లైనప్‌ ఉన్న పాక్‌పై 283 పరుగులు లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో ఓవర్ మిగిలి ఉండగానే అఫ్గానిస్థాన్ ఛేదించింది. పాక్‌కు ఇది వరుసగా మూడో ఓటమి కాగా.. అఫ్గానిస్థాన్‌కు రెండో గెలుపు. ఈ ఓటమితో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. 

పాకిస్థాన్ విధించిన 283 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ తొలి వికెట్‌కు 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెహ్మానుల్లా గుర్బాజ్ (53 బంతుల్లో 65, 9 ఫోర్లు, ఒక సిక్స్), ఇబ్రహీం జద్రాన్ (113 బంతుల్లో 87, 10 ఫోర్లు) రాణించడంతో పాక్ ఓటమి ఖరారై పోయింది. 

ఆ తరువాత కెప్టెన్‌ హష్మతుల్లా షాహిదీ, రహ్మత్ షా పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మూడో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రహ్మత్ షా (84 బంతుల్లో 77 నాటౌట్, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హష్మతుల్లా షాహిదీ (45 బంతుల్లో 48, 4 ఫోర్లు నాటౌట్‌) ధాటిగా ఆడడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే అఫ్గాన్ జయకేతనం ఎగురవేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హసన్ అలీ తలో వికెట్ తీశారు. 

అంతకుముందు పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ (92 బంతుల్లో 74, 4 ఫోర్లు, ఒక సిక్స్), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (75 బంతుల్లో 58, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 40, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాదాబ్ ఖాన్ 38 బంతుల్లో 40 పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్ నూర్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగగా.. నవీన్ ఉల్ హక్ 2, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో వికెట్ పడగొట్టారు. 87 పరుగులతో అదరగొట్టిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

Also Read: Maruti Suzuki Jimny Discounts: మారుతి సుజుకి జిమ్నీ కొనేవారికి బంపర్ గుడ్ న్యూస్

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More