Home> క్రీడలు
Advertisement

కోహ్లీసేనను దెబ్బకొట్టేందుకు కివీస్ దగ్గర ''ఇంగ్లండ్ ఫార్ములా'' !!

వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్ లో టీమీండియాను ఎదుర్కొనేందుకు సరికొత్త పార్ములా కోసం కివీస్ జట్టు బీజీగా ఉంది

కోహ్లీసేనను దెబ్బకొట్టేందుకు కివీస్ దగ్గర ''ఇంగ్లండ్ ఫార్ములా'' !!

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది.  సెమీస్ పోరులో తలపడేందుకు ఆయా జట్లు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా సెమీస్ పోరులో టీమిండియాను న్యూజిలాండ్ జట్టు తలపడాల్సి ఉంది.  భీకర ఫాంలో ఉన్న భారత్ ను దెబ్బకొట్టే అన్ని రకాల దారులను కివీస్ వెతుకుతోంది.  లీగ్ దశలో భారత్ జైత్రయాత్రకు ఇంగ్లండ్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో  దెబ్బకొట్టేందుకు ఇంగ్లండ్ ఫార్మాలా అమలు చేయాలని భావిస్తోంది.

ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై ఇంగ్లాండ్ ఎలాంటి ఎత్తుగడలు అనుసరించిందో కివీస్ కూడా ఆ తరహా వ్యూహాలనే సెమీస్ లో అమలుచేయాలని మాజీ క్రికెటర్ డానియెల్ వెటోరీ సలహా ఇచ్చాడు. కోహ్లీ సేనపై విజయం సాధించాలంటే విధ్వంసకర ఆరంభం అవసరమన్నామని ఉద్బోధించాడు. తొలి 10 ఓవర్లలో ఎలా ఆడామన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని... అది బ్యాట్ తోనైనా, బంతితోనైనా ప్రత్యర్థిని ఆ పది ఓవర్లలోనే దెబ్బకొట్టాలని విటోరీ సూచించాడు.

కివీస్ కు ఇంగ్లండ్ తరహా ఫార్మలా అమలు చేయడం అంత తేలికకాదంటున్నారు విశ్లేషకులు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోహ్లీసేనను ఓడించేందుకు ప్రతీ సారీ ఒకే తరహా పనికొస్తుందనుకోవడం అత్యాశే అవుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కివీస్ జట్టును బోల్తా కొట్టించేందకు టీమిండియా ఇప్పటికీ ప్లాన్ 1 ప్లాన్ 2 ప్లాన్ 3 సిద్ధం చేసినట్లు తెలిసింది.

Read More