Home> క్రీడలు
Advertisement

Rahul Dravid: కాన్పూర్ టెస్ట్ పిచ్‌పై రాహుల్ ద్రవిడ్ ఏమ్మన్నారంటే?

చివరి రోజు కాన్పూర్ పిచ్‌ నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా భారత బౌలర్లు 8 వికెట్లు తీశారని రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసించారు. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్‌ భారత్‌ సొంతమయ్యేదన్నారు.
 

Rahul Dravid: కాన్పూర్ టెస్ట్ పిచ్‌పై రాహుల్ ద్రవిడ్ ఏమ్మన్నారంటే?

No bounce and Didn't have a Turn: Rahul Dravid responds On Kanpur Test Pitch On Day 5: రెండు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కాన్పూర్ (Kanpur Test) వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు 'డ్రా' అయిన విషయం తెలిసిందే. గెలవడానికి టీమిండియా (Team India) విశ్వప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. కివీస్ టెయిల్‌ఎండర్స్ రచిన్‌ రవీంద్ర (18; 91 బంతుల్లో 2x4), అజాజ్‌ పటేల్‌ (2; 23 బంతుల్లో) చివరి వరకూ క్రీజులో నిల్చొని మ్యాచ్‌ను కాపాడారు. ఈ ఇద్దరిలో ఒక్కరు ఔట్‌ అయినా  మ్యాచ్‌ భారత్ సొంతమయ్యేది. కానీ వారు ఆ అవకాశం ఇవ్వలేదు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. మరోవైపు వెలుతురులేమి కూడా మనకు ప్రతికూకూలాంశంగా మారింది. ఇక మ్యాచ్‌ అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) కాన్పూర్ పిచ్‌పై స్పందించారు.

చివరి రోజు కాన్పూర్ పిచ్‌ (Kanpur Pitch) నుంచి ఏమాత్రం స్పందన లేకపోయినా భారత బౌలర్లు 8 వికెట్లు తీశారని రాహుల్‌ ద్రవిడ్‌ (Dravid) ప్రశంసించారు. కాస్త అదృష్టం కలిసొస్తే మ్యాచ్‌ భారత్‌ సొంతమయ్యేదన్నారు. మ్యాచ్ అనంతరం ద్రవిడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ఐదవ రోజు చివరి సెషన్లో టీమిండియా బాగా ఆడింది. గొప్ప పోరాట తత్వం చూపించింది. చివరిరోజు రోజు పిచ్‌ నుంచి ఎలాంటి స్పందనా లేదు. అయినా కూడా బోజనవిరామం తర్వాత 8 వికెట్లు పడగొట్టారంటే.. మనోళ్లను మెచ్చుకోవాల్సిందే. కాస్త అదృష్టం కలిసొస్తే.. మ్యాచ్‌ భారత్‌ సొంతమయ్యేది. ఏదేమైనా మన ఆటగాళ్లు గొప్పగా పోరాడారు. అందుకు నేను గర్విస్తున్నా' అని అన్నారు. 

Also Read: Jennifer Lawrence: నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ‍్చు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన హాలీవుడ్‌ నటి!

'ఈ పిచ్‌పై బంతి మరీ నెమ్మదిగా, తక్కువ ఎత్తులో వచ్చింది. బౌన్స్‌, టర్న్‌ ఏమీ లేదు. సాధరణంగా భారత పరిస్థితుల్లో చివరి రోజు పిచ్‌లో పగుళ్లు వస్తాయి కాబట్టి స్పిన్నర్లు చెలరేగుతారు. ఇన్‌ సైడ్‌, ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌లతో వికెట్లు తీస్తారు. ఎక్కువగా ఎల్బీగా ఔట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ కాన్పూర్‌లో అందుకు బిన్నంగా జరిగింది. బహుశా ఇది శీతాకాలం కాబట్టి పిచ్‌లో పగుళ్లు రాలేదేమో. అయినా  టీమిండియా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టారు. నేను ఇక్కడ ఆడాను. వికెట్లు కఠినంగా ఉంటాయని నాకు తెలుసు' అని టీమిండియా కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నారు. 

Also Read: Twitter CEO Jack Dorsey: సీఈఓ జాక్ డోర్సీ నుంచి CTO Parag Agrawal కి సీఈఓ బాధ్యతలు

'ముంబై టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి తుది జట్టుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ముందు అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలి. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ చూసుకోవాలి. విరాట్ కోహ్లీ జట్టుతో కలుస్తాడు. అతడితో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం' అని ది వాల్ రాహుల్ ద్రవిడ్‌ (Rahul Dravid)  చెప్పారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 సిరీస్, తొలి టెస్టుకు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ముంబై టెస్టుకు అతడు అందుబాటులోకి రానున్నాడు. దాంతో తొలి టెస్ట్ ఆడిన వారిలో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లేదా వైస్ కెప్టెన్ అజింక్య రహానేలలో ఒకరు తుది జట్టులో స్థానం కోల్పోనున్నారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More