Home> క్రీడలు
Advertisement

Nikhat Zareen: వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌‌గా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్...

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్‌ జిట్‌ పాంగ్‌ను చిత్తు చేసి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 52 కిలోల విభాగంలో జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరుపున నిఖత్ జరీన్ సత్తా చాటడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

Nikhat Zareen: వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌‌గా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్...

Nikhat Zareen Womens World Boxing Champion: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఫైనల్లో థాయిలాండ్ బాక్సర్‌ జిట్‌ పాంగ్‌ను చిత్తు చేసి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 52 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ 5-0తో సత్తా చాటి గోల్డ్ మెడల్ గెలిచింది. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరుపున నిఖత్ జరీన్ సత్తా చాటడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

గత 14 ఏళ్లలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరుపున గోల్డ్ మెడల్ గెలిచింది మేరీ కోమ్ తర్వాత నిఖత్ జరీనే కావడం విశేషం. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటివరకూ భారత్ తరుపున ఈ ఘనత సాధించిన ఐదో బాక్సర్‌గా నిఖత్ జరీన్ నిలిచింది. ఆమె కన్నా ముందు వరుసలో మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ ఉన్నారు. 25 ఏళ్ల నిఖత్ జరీన్ గతంలో జూనియర్ యూత్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కూడా గెలిచింది.

భారత్ తరుపున మరో ఇద్దరు మహిళా బాక్సర్లు మనీషా (57 కిలోల విభాగం), పర్వీన్ (63 కిలోల విభాగం) ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటారు. ఈ ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. 2019లో రష్యాలో జరిగిన వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఒక రజతం, మూడు కాంస్య పతకాలు సాధించారు. ఇప్పటివరకూ జరిగిన వుమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత బాక్సర్లు 36 మెడల్స్ గెలిచారు. ఇందులో తొమ్మిది స్వర్ణాలు, 8 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పతకాల్లో రష్యా (60), చైనా (50) తర్వాత భారత్  మూడో స్థానంలో ఉంది. 
 

Also Read: Nallala Odelu Joins Congress: కాంగ్రెస్‌ గూటికి నల్లాల ఓదెలు.. ప్రియాంక గాంధీ సమక్షంలో చేరిక.. ఇక బాల్క సుమన్‌తో 'ఢీ'..! 

Also Read:  Jeevitha Rajasekhar Apology: ఆర్యవైశ్యులకు జీవిత రాజశేఖర్ క్షమాపణ... వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ...   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More