Home> క్రీడలు
Advertisement

ENG vs NED: డేవిడ్ మలాన్ భారీ సిక్సర్.. బంతి కోసం తుప్పల్లో తంటాలు పడ్డ నెదర్లాండ్స్ ప్లేయర్స్!

NED vs ENG: Netherlands players search for the ball in bushes. డేవిడ్ మలన్ బంతిని బలంగా బాదడంతో  మైదాన సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ సగం ఆటగాళ్లు తుప్పల్లోకి వెళ్లి బంతి కోసం వెతికారు.
 

ENG vs NED: డేవిడ్ మలాన్ భారీ సిక్సర్.. బంతి కోసం తుప్పల్లో తంటాలు పడ్డ నెదర్లాండ్స్ ప్లేయర్స్!

Netherlands players search for the ball in bushes after Dawid Malan hits huge six: నెద‌ర్లాండ్స్‌తో ఆమ్‌స్టెల్వీన్‌లో జరిగిన తొలి వ‌న్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు పెను విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిలిప్‌ సాల్ట్ (122; 93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మలన్ (125; 109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), జొస్ బట్లర్ (162 నాటౌట్; 70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సులు), లియామ్ లివింగ్‌స్టోన్ (66 నాటౌట్; 22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. అందరూ కలిసి 26 సిక్సర్లు, 36 ఫోర్లతో మైదానాన్ని హోరెత్తించారు. దాంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 498 రన్స్ చేసి.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. 

సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేయగా వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మలన్ భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ వేసిన 9వ ఓవర్‌లో మలన్ భారీ సిక్సర్ బాదాడు. మలన్ బంతిని బలంగా బాదడంతో అది కాస్త స్టేడియంను ఆనుకుని ఉన్న పెద్దపెద్ద చెట్లు కింద ఉన్న తుప్పల్లో పడింది. బంతి కోసం ఇద్దరు నెదర్లాండ్స్ ప్లేయర్స్ అక్కడికి వెళ్లగా.. ఫలితం లేకుండా పోయింది. 

మైదాన సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ సగం ఆటగాళ్లు తుప్పల్లోకి వెళ్లి బంతి కోసం వెతికారు. అంతమంది ఒకేసారి వెతికితే గానీ.. రెండు నిమిషాలకు బంతి కనిపించింది. ఈ ఘటన చుసిన మైదానంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లు కాసేపు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లు కొట్టే కొట్టుడుకు బంతులన్నీ వెళ్లి స్టేడియం అవతల చాలా సార్లే పడ్డాయి. దాంతో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లు పరిస్థితి దారుణంగా మారింది. 

Also Read: Male Health Issues: పురుషుల్లో రోజు రోజూకు పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. విముక్తి పొందడానికి సరైన మార్గాలు ఇవే..!

Also Read: Harish Rao on Agnipath: ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే అగ్నిపథ్‌..కేంద్రంపై హరీష్‌ ఫైర్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Read More