Home> క్రీడలు
Advertisement

ICC T20 World Cup: క్రికెట్‌ ప్రపంచమా.. నమీబియా పేరు గుర్తుపెట్టుకో: సచిన్‌

Sachin Tendulkar Tweet goes viral on Namibia after victory vs Sri Lanka. టీ20 ప్రపంచకప్‌ 2022 క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై సంచలన విజయం నమోదు చేసిన నమీబియాపై సచిన్‌ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 

ICC T20 World Cup: క్రికెట్‌ ప్రపంచమా.. నమీబియా పేరు గుర్తుపెట్టుకో: సచిన్‌

Sachin Tendulkar heap praise on Namibia after victory over Sri Lanka: టీ20 ప్రపంచకప్‌ 2022 రౌండ్‌-1లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ శ్రీలంకకు పసికూన నమీబియా భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలోని గీలాంగ్‌ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ‍నమీబియా 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్‌ 2022లో భారత్, పాకిస్థాన్‌లను ఓడించి టైటిల్‌ సాధించిన లంక ఇలా చిత్తుగా ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

టీ20 ప్రపంచకప్‌ 2022 క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సంచలన విజయం నమోదు చేసిన నమీబియా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తాచాటిన నమీబియాను అభినందిస్తూ మాజీలు అందరూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ చేసిన ట్వీట్‌ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ ప్రపంచమా.. నమీబియా పేరు గుర్తుపెట్టుకో అని సచిన్ ట్వీటారు. 'ఈ రోజు క్రికెట్ ప్రపంచానికి తన సత్తా ఏంటో నమీబియా చాటి చెప్పింది. నమీబియా పేరు గుర్తుపెట్టుకోండి' అని పేర్కొన్నారు. 

టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్‌ జాఫర్‌ కూడా తనదైన శైలిలో ఓ ట్వీట్ చేశారు. ఓ వీడియో స్పూఫ్‌తో నవ్వులు పూయించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7  వికెట్ల నష్టానికి 163 రన్స్ చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఫ్రైలింక్‌ (44), స్మిత్ (31) పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో శ్రీలంక 108 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. 55 పరుగుల తేడాతో నమీబియా గెలుపొందింది. ఫ్రైలింక్‌ బౌలింగ్‌లో కూడా చెలరేగాడు. 

Also Read: ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్స్.. శ్రీలంక జట్టుపై పేలుతున్న జోకులు!

Also Read: Sitrang Cyclone: 'సిత్రాంగ్' వచ్చేస్తుంది.. మరికొన్ని రోజులు భారీ వర్షాలు తప్పవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Read More