Home> క్రీడలు
Advertisement

Kieron Pollard: భీకర ఫామ్‌తో ఐపీఎల్‌కు పోలార్డ్

కీరన్ పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో (Caribbean Premier League)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Kieron Pollard: భీకర ఫామ్‌తో ఐపీఎల్‌కు పోలార్డ్

వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పోలార్డ్ (Kieron Pollard) కరీబియర్ ప్రీమియర్ లీగ్‌ (Caribbean Premier League)లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పోలార్డ్ బ్యాటింగ్‌కు దిగేసరికి నైట్ రైడర్స్ దాదాపు ఓటమి అంచున ఉంది. 44 బంతుల్లో 87 పరుగులు చేయాల్సిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన పోలార్డ్ సిక్సర్లు, ఫోర్లతో వీర విహారం చేశాడు. Suresh Raina: దోపిడీ దొంగల దాడిలో సురేష్ రైనా బంధువు మృతి

28 బంతుల్లో 9 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు పోలార్డ్. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ట్రింబాగో నైట్ రైడర్స్ మరో బంతి మిగిలుండగానే 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి ఉత్కంఠపోరులో విజయం సాధించింది. Anushka Sharma Pregnancy: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ

పోలార్డ్ దాటికి బౌలర్ రషీద్ ఖాన్ 24 బంతుల్లోనే 66 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2020 ప్రారంభం కానుండగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు భీకర ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు శుభవార్త. అయితే కరీబియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా విండీస్ ఆటగాళ్లు తొలి వారం, పది రోజులపాటు ఐపీఎల్ 2020కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ వారి జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తే మాత్రం తొలి మ్యాచ్ సమయానికి యూఏఈకి చేరుకుంటారని ముందుగానే వెల్లడించారు. IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
 
 Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత 

Read More