Home> క్రీడలు
Advertisement

IPL 2022: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డ్..ఫ్యాన్స్‌కి నిరాశ..!

IPL 2022: ఐపీఎల్ లో వరుస ఓటములతో కుదేలవుతోంది ముంబై ఇండియన్స్. గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో మిస్టర్ కూల్ ధోని చివరి బంతికి ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు.

IPL 2022: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డ్..ఫ్యాన్స్‌కి నిరాశ..!

IPL 2022: ఐపీఎల్ లో వరుస ఓటములతో కుదేలవుతోంది ముంబై ఇండియన్స్. గురువారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో మిస్టర్ కూల్ ధోని చివరి బంతికి ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించాడు. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ వరుసగా ఏడు ఓటములు మూటకట్టుకుంది. దీంతో ఐపీఎల్ లో అత్యంత చెత్త రికార్డును ముంబై జట్టు నమోదు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే వరుసగా తొలి ఏడు మ్యాచ్‌లు ఓడిపోయిన మొదటి జట్టుగా నిలిచింది. 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ , 2019లో ఆర్సీబీ ఆడిన  మొదటి ఆరు మ్యాచ్‌లు ఓడిపోయాయి.   

ఐపీఎల్ 15వ సీజన్ లో తొలి మ్యాచ్ మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడింది ముంబై. తొలి మ్యాచ్ లో రోహిత్‌ సేన 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌,  బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, లక్నో జట్ల చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగిన హోరీహోరీగా సాగిన మ్యాచ్ లో సీఎస్ కే చేతిలో చిత్తైంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది రోహిత్ టీమ్.

చెన్నై మ్యాచ్ లో  డకౌట్ అయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ లో 14 సార్లు డకౌట్ అయిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఇప్పటివరకు డకౌట్లలో ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉన్న పియూష్‌ చావ్లాను రోహిత్‌ వెనక్కి నెట్టి ఫస్ట్‌ ప్లేస్‌ కు చేరుకున్నాడు. 13 డకౌట్లతో రెండు, మూడు స్థానాల్లో పీయూష్‌ చావ్లా, హర్భజన్‌ సింగ్‌ ఉన్నాడు.  నాలుగో స్థానంలో మన్‌దీప్‌ సింగ్‌, ఐదో స్థానంలో పార్థివ్‌ పటేల్‌, ఆరు, ఏడు స్థానాల్లో అంబటి రాయుడు, అంజిక్య రహానే ఉన్నారు. వీరంతా కూడా 13 సార్లు డకౌట్‌ అయ్యారు. ఇక 12 డకౌట్లతో దినేశ్‌ కార్తీక్‌ మనీష్‌ పాండే, గంభీర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read: Man Attacked MCA Student: ప్రేమోన్మాది ఘాతుకం ..యువతి ఇంటికి వెళ్లి కత్తితో గొంతుకోసిన యువకుడు..!

Also Read: AP 10th Class Exams 2022: పదో తరగతి విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే చాలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More