Home> క్రీడలు
Advertisement

Mumbai Indians: మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ రెండూ ఢిల్లీతోనే..ముంబై టీమ్ షెడ్యూల్ ఇదే

Mumbai Indians: ఐపీఎల్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఒక్కొక్క జట్టు ప్రాక్టీసు ప్రారంభిస్తున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరవసారి విజయం సాధించేందుకు సిద్ధమౌతోంది. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుంది..ఎప్పుడు, ఎవరితో ఆడనుందో పరిశీలిద్దాం.

Mumbai Indians: మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ రెండూ ఢిల్లీతోనే..ముంబై టీమ్ షెడ్యూల్ ఇదే

Mumbai Indians: ఐపీఎల్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఒక్కొక్క జట్టు ప్రాక్టీసు ప్రారంభిస్తున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరవసారి విజయం సాధించేందుకు సిద్ధమౌతోంది. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుంది..ఎప్పుడు, ఎవరితో ఆడనుందో పరిశీలిద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ మరో 16 రోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఐపీఎల్‌ను ముంబైలో ఇండియాలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎక్కువ శాతం మ్యాచ్ లను ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వాంఖడేలో అడనుండటం విశేషం. ఐపీఎల్ 2022 షెడ్యూల్ ప్రకారం ముంబై ఇండియన్స్ మొత్తం 14 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్, చివరి మ్యాచ్ రెండూ ఢిల్లీ కేపిటల్స్‌తోనే ఆడనుండటం గమనార్హం. ముంబై ఇండియన్స్ మొత్తం షెడ్యూల్ ఎలా ఉందో పరిశీలిద్దాం

మార్చ్ 27న తొలి మ్యాచ్ ఢిల్లీ కేపిటల్స్‌తో బ్రబౌర్న్ స్డేడియం
ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో డివై పాటిల్ స్డేడియం
ఏప్రిల్ 6 కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పూణేలోని ఎంసీఏ స్డేడియం
ఏప్రిల్ 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎంసీఏ స్డేడియం
ఏప్రిల్ 13న పంజాబ్ కింగ్స్ జట్టుతో ఎంసీఏ స్డేడియం
ఏప్రిల్ 16న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎంసీఏ స్డేడియం
ఏప్రిల్ 21న చెన్నై సూపర్‌కింగ్స్‌తో డివై పాటిల్ స్డేడియం
ఏప్రిల్ 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడే స్డేడియం
ఏప్రిల్ 30న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో వాంఖడే స్డేడియం
మే 6న గుజరాత్ టైటాన్స్ జట్టుతో డీవై పాటిల్ స్డేడియం
మే 9న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో డీవై పాటిల్ స్డేడియం
మే12న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో  వాంఖడే స్టేడియం
మే 17న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో వాంఖడే స్డేడియం
మే 21న ఢిల్లీ కేపిటల్స్ జట్టుతో వాంఖడే స్డేడియం

Also read: IPL 2022: సిక్సర్ల మోత..వైరల్ అవుతున్న ధోనీ నెట్ ప్రాక్టీసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More