Home> క్రీడలు
Advertisement

164, 162 కిమీ వేగంతో బంతులు వేశా.. కానీ బౌలింగ్ మెషీన్ పనిచేయలేదు: సమీ

Mohammad Sami about Fastest Delivery. పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మొహమ్మద్ సమీ తన బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలను తాను రెండు సార్లు సాధించానన్నాడు.
 

164, 162 కిమీ వేగంతో బంతులు వేశా.. కానీ బౌలింగ్ మెషీన్ పనిచేయలేదు: సమీ

Mohammad Sami said He bowled two deliveries above 160 kph: పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ మొహమ్మద్ సమీ తన బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలను తాను రెండు సార్లు సాధించానన్నాడు. అయితే ఆ సమయంలో బౌలింగ్ స్పీడ్‌గన్ (బౌలింగ్‌ వేగాన్ని కొలిచే మెషీన్‌) పనిచేయకపోవడంతో అవి లెక్కలోకి తీసుకోలేదని తెలిపాడు. ఒకప్పుడు స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌తో కలిసి సమీ బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా మొహమ్మద్ సమీ ఓ పాకిస్తాన్ స్థానిక ఛానల్‌తో మాట్లాడుతూ... 'నేను ఓ మ్యాచ్‌లో రెండు బంతులను 160 కిమీ వేగంకు పైగా బౌలింగ్‌ చేశా. ఓ బంతి 162 కి.మీ వేగంతో పడగా.. మరొకటి 164 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. అయితే అప్పుడు స్పీడ్‌గన్‌ పనిచేయడం లేదని మైదాన సిబ్బంది చెప్పడంతో.. ఆ బంతుల్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికి కూడా 160 కిమీ వేగంతో బంతులేసిన సందర్భాలు 1-2 మాత్రమే ఉంటాయి' అని అన్నాడు. 

ఏ బౌలర్ అయినా నిలకడగా 160 కిమీ వేగంతో బౌలింగ్ చేయలేరని, ఎదో ఓసారి అలాంటి బంతులు పడతాయని మొహమ్మద్ సమీ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 161.3 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతే ఫాస్టెస్ట్ డెలివరీ అని షోయబ్ అక్తర్ అన్నాడు. 2002లో న్యూజిలాండ్‌లో ఆ రికార్డు నెలకొల్పానని తెలిపాడు. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అక్తర్‌ వేసిన 161.3 కిమీ బంతే ఫాస్టెస్ట్ డెలివరీగా రికార్డుల్లో ఉంది. ఆస్ట్రేలియన్ బౌలర్లు బ్రెట్ లీ, షాన్ టైట్ 160 కిమీ వేగంతో బౌలింగ్ చేసినా.. అవి లెక్కలోకి రాలేదు. 

పాకిస్థాన్ తరఫున మొహమ్మద్ సమీ 36 టెస్ట్‌లు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వరుసగా 85, 121, 21 వికెట్లు పడగొట్టాడు. అత్యధికంగా 156.4 కిమీ వేగంతో బంతిని సంధించాడు. 2003లో షార్జాలో జింబాబ్వేతో జరిగిన మ్యాచులో ఈ రికార్డు నెలకొల్పాడు. సమీ అరంగేట్ర టెస్ట్ మ్యాచ్‌లోనే 8 వికెట్లు తీసి సంచలనం నెలకొల్పాడు. శ్రీలంక జట్టుపై హ్యాట్రిక్ తీశాడు. ఇక వెస్టిండీస్‌తో వన్డేల్లో హ్యాట్రిక్ తీశాడు. టెస్ట్‌, వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో పాక్ బౌలర్‌గా సమీ నిలిచాడు.

Also Read: Rohit Sharma Wife: కన్నీరుపెట్టుకున్న రోహిత్ శర్మ సతీమణి.. ఓదార్చిన అశ్విన్ భార్య!

Also Read: Ketika Sharma Post: నేను సెక్సీగా ఉన్నానా లేదా.. యువ హీరోయిన్ అలా అడిగేసిందేందబ్బా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More