Home> క్రీడలు
Advertisement

Moeen Ali Retention Reason: మొయిన్ అలీని చెన్నై సూపర్‌కింగ్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా

Moeen Ali Retention Reason: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక క్రీడాభిమానులు, ఫ్రాంచైజీల దృష్టి అంతా 2022లో జరిగే ఐపీఎల్ మెగా ఆక్షన్ పైనే. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మరోసారి మొయిన్ అలీని రిటైన్ చేసుకోవడంపై కారణాలేంటనేది పరిశీలిద్దాం.

Moeen Ali Retention Reason: మొయిన్ అలీని చెన్నై సూపర్‌కింగ్స్ ఎందుకు రిటైన్ చేసుకుందో తెలుసా

Moeen Ali Retention Reason: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక క్రీడాభిమానులు, ఫ్రాంచైజీల దృష్టి అంతా 2022లో జరిగే ఐపీఎల్ మెగా ఆక్షన్ పైనే. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు మరోసారి మొయిన్ అలీని రిటైన్ చేసుకోవడంపై కారణాలేంటనేది పరిశీలిద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)15వ సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కీలకమైన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ సహా ఇతర జట్లు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి. చైన్నై సూపర్‌కింగ్స్ జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అటు ముంబై ఇండియన్స్ కూడా నలుగురిని రిటైన్ చేసుకుని మిగిలిన ఆటగాళ్ల వేలం కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలో వివిధ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మొయిన్ అలీని చెన్నై సూపర్‌కింగ్స్ కీలక ఆటగాడిగా భావిస్తూ రిటైన్ చేసుకోవడంపై కారణాల్ని ఆ జట్టు సీఈవో వెల్లడించారు.

రవీంద్ర జడేజాను 16 కోట్లకు సీఎస్కే(CSK) రిటైన్ చేసుకోగా, మహేంద్ర సింగ్ ధోనీని 12 కోట్లకు, మొయిన్ అలీని 8 కోట్లకు రుతురాజ్ గైక్వాడ్‌ను 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. మొయిన్ అలీ రిటెన్షన్ కారణాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్ 2022 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుతో కలిసి ఉండేందుకే మొయిన్ అలీ ఆసక్తి చూపించారని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. మరో ఇతర ఫ్రాంచైజీ కోసం ఆడాలనే ఆలోచన అతని లేదని కూడా సీఎస్కే వెల్లడించింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో సీఎస్కే జట్టు మొయిన్ అలీ(Moeen Ali) కోసం 7 కోట్ల రూపాయలు వెచ్చించింది. గత సీజన్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ 15 మ్యాచ్‌లు ఆడి..357 పరుగులు చేయడమే కాకుండా 6 వికెట్లు తీశాడు. నాలుగోసారి సీఎస్కే టైటిల్ సాధనలో మొయిన్ అలీ పాత్ర కీలకం. అన్నింటికంటే ముఖ్యంగా మరో ఇతర ఫ్రాంచైజీ ఆలోచన లేదని చెప్పడం నచ్చిందని సీఎస్కే(CSK Retained Moeen Ali) సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.  

మరోవైపు మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra singh Dhoni) కూడా సీఎస్కేలో కొనసాగుతానని చెప్పినట్టు కాశీ విశ్వనాథన్ తెలిపారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2022 పూర్తిగా ఆడతాడా లేడా అనేది అప్పుడే చెప్పలేమంటోంది సీఎస్కే జట్టు.

Also read: IPL 2022 Retention Players: రషీద్ ఖాన్, కేఎల్ రాహుల్‌లపై వేటు పడనుందా..బీసీసీఐ నిర్ణయమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More