Home> క్రీడలు
Advertisement

Sachin Tendulkar: సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే ఆందోళన.. భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్

MLA Bacchu Kadu Protests At Sachin Tendulkar’s House: ఆన్‌లైన్ గేమ్స్‌కు సచిన్ టెండూల్కర్ ప్రచారకర్త వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే బచ్చూ కాడూ తప్పుబట్టారు. వెంటనే ఈ ప్రచారాన్ని ఆపేయాలని.. భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచిన్ ప్రచారంతో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. 
 

Sachin Tendulkar: సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే ఆందోళన.. భారతరత్న వెనక్కి ఇవ్వాలని డిమాండ్

MLA Bacchu Kadu Protests At Sachin Tendulkar’s House: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఓ ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు ప్రచారకర్తగా సచిన్ వ్యవహరించడంపై నిరసన తెలుపుతూ.. తన మద్దతుదారులతో కలిసి బైఠాయించారు. నిరసన తెలిపిన ప్రహార్‌ జనశక్తి పక్ష ఎమ్మెల్యే బచ్చూ కాడూతోపాటు మరో 22 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసు చట్టంలోని సెక్షన్ 37 (నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన), సెక్షన్ 135 (చట్టాన్ని ఉల్లంఘించడం) కింద అభియోగాలు మోపినట్లు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. కాగా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రహార్ జనశక్తి పార్టీ సపోర్ట్‌గా ఉంది.

నిరసన సమయంలో ఎమ్మెల్యేతోపాటు మద్దతుదారులు సచిన్ టెండూల్కర్ ఆన్‌లైన్ గేమ్‌లకు మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. భారతరత్న అవార్డును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. యువత జీవితాలను నాశనం చేసే ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు సచిన్ ప్రచారం ఏంటని ఎమ్మెల్యే బచ్చూ కాడూ ప్రశ్నించారు. 

“సచిన్ టెండూల్కర్ తన భారతరత్న అవార్డును తిరిగి ఇవ్వాలి. ఆన్‌లైన్ గేమింగ్ ప్రచారం నుంచి వైదొలగకుంటే.. మేము ఈ ప్రకటనను ప్రదర్శించే ప్రతి గణేష్‌ మండపం ముందు నిరసన తెలియజేస్తాం. సచిన్ ఈ యాడ్స్ ఆపేయాలని డిమాండ్ చేస్తాం.” అని ఎమ్మెల్యే తెలిపారు.  ఇలాంటి ప్రచారాలతో రూ.300 కోట్లు సంపాదించాలనుకుంటే.. వెంటనే భారతరత్నను తిరిగి ఇవ్వాలని అన్నారు. కొన్ని రోజుల క్రితం ఈ విషయంపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకి లేఖ రాసినట్లు తెలిపారు. 

ఆన్‌లైన్ గేమింగ్ వంటి అనైతిక కార్యకలాపాలను టెండూల్కర్ ప్రోత్సహిస్తూ ఉంటే భారతరత్న గౌరవాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషనల్ క్యాంపెయిన్ నుంచి వైదొలగాలని తాను చేసిన విజ్ఞప్తికి సమాధానం ఇవ్వకపోవడంతో సచిన్ టెండూల్కర్‌కు లీగల్ నోటీసు పంపాల్సి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. గత వారం షారూఖ్ ఖాన్ ఇంటి ముందు కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి. నిరసనల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. రెండు అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి..?  

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More