Home> క్రీడలు
Advertisement

Manika Batra: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. ఆసియా కప్‌లో తొలి మెడల్

Manika Batra Wins Bronze Medal in Asian Cup TT: ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ 2022లో  భారత్ చరిత్ర సృష్టించింది. మనిక బాత్రా కాంస్యం పథకం సొంతం చేసుకుంది. 
 

Manika Batra: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. ఆసియా కప్‌లో తొలి మెడల్

Manika Batra Wins Bronze Medal in Asian Cup TT: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ మహిళా క్రీడాకారిణి మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ 2022లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించిన భారతదేశం నుంచి మొదటి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. కాంస్య పతక పోరులో ప్రపంచ నంబర్ 6 టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హీనా హయత్‌ను 4-2 పాయింట్ల తేడాతో ఓడించింది.

ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ 2022 కాంస్య పతక పోరులో భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా అద్భుత ఆటను ప్రదర్శించింది. ప్రపంచ 6వ ర్యాంకర్ మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హీనా హయత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2 స్కోరు సాధించి.. 4-2 పాయింట్ల విజయం సాధించింది. ఈ టోర్నీ ఫైనల్స్‌కు చేరి స్వర్ణం చేజిక్కించుకోవాలని భారత అభిమానులు అందరూ ఆశించిగా.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ మిమా ఇటో చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో బాత్రా స్వర్ణం సాధించాలన్న కల చెదిరిపోయింది. అయినా ధైర్యం కోల్పోకుండా కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.

మనిక బాత్రా ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి చెన్ సు యును 4-3తో ఓడించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ చైనీస్ తైపీ ప్లేయర్ చెన్ హ్సు యుపై అద్భుత విజయం సాధించింది. ఆమె 6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9తో చెన్ సూ యును ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో నాలుగో సీడ్, ప్రపంచ ఐదో ర్యాంకర్ మిమా ఇటో  8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11 (2-4) తేడాతో ఓడిపోయింది. 

39 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో మనిక భారతీయులలో అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డు సృష్టించింది. అంతకుముందు 2015లో పురుష టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్, 2019లో జి.సత్యన్ ఆరో స్థానంలో నిలిచారు. ఢిల్లీకి చెందిన మనికా బత్రా 2020లో క్రీడా ప్రపంచంలోని అత్యున్నత పురస్కారమైన ఖేల్ రత్న అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

Also Read: PM Kisan: పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. ఆ రోజే లాస్ట్..!  

Also Read: Bandi Sanjay: మా ఎండింగ్ భయంకరంగా ఉంటుంది.. కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More