Home> క్రీడలు
Advertisement

Laxman Sivaramakrishnan : చీఫ్ సెలెక్టర్ రేసులో లక్ష్మణ్.. ఎవరీ లక్ష్మణ్

బీసీసీఐ నేషనల్ సెలెక్షన్ కమిటీలో సెలెక్టర్ పోస్టుకు టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ దరఖాస్తు చేసుకున్నాడు. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అమయ్ ఖురాసియా కూడా సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.

Laxman Sivaramakrishnan : చీఫ్ సెలెక్టర్ రేసులో లక్ష్మణ్.. ఎవరీ లక్ష్మణ్

బీసీసీఐ నేషనల్ సెలెక్షన్ కమిటీలో సెలెక్టర్ పోస్టుకు టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ దరఖాస్తు చేసుకున్నాడు. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అమయ్ ఖురాసియా కూడా సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. జనవరి 24 శుక్రవారం దరఖాస్తుకు చివరి తేదీ కాగా.. మరో ఇద్దరు మాజీ సీనియర్ ఆటగాళ్లు ఈ పోస్టుకు పోటీపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ టీమిండియా సెలెక్టర్స్ కమిటీకి పోటీపడుతున్న ఆ ఇద్దరు ఆటగాళ్లలో ఒకరు వెంకటేష్ ప్రసాద్ కాగా మరొకరు సంజయ్ బంగర్. జూనియర్ మెన్స్ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న వెంకటేష్ ప్రసాద్ ఒకవేళ ఈ కమిటీకి ఎంపికైనట్టయితే.. అతడు ఇంకొ ఏడాదిన్నర కాలం మాత్రమే ఈ కమిటీ సభ్యుడిగా కొనసాగుతాడు. బీసీసీఐ నియమనిబంధనల ప్రకారం సెలెక్షన్ కమిటీ పదవీ కాలం నాలుగేళ్లు కాగా.. ఇప్పటికే వెంకటేష్ ప్రసాద్ రెండున్నరేళ్లుగా జూనియర్ మెన్స్ క్రికెట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. ఈ కారణంగానే సీనియర్ సెలెక్టర్స్ కమిటీలో అతడికి మరో ఏడాదిన్నర మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం జాతీయ సెలక్టర్స్ కమిటీలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.

ఆ ఇద్దరి స్థానంలో..
బీసీసీఐ సెలెక్టర్స్ కమిటీలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కె ప్రసాద్ ( సౌత్ జోన్), గగన్ ఖోర ( సెంట్రల్ జోన్) పదవీ కాలం త్వరలోనే ముగియనుండగా శరణ్‌దీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరంజ్‌పే (వెస్ట్ జోన్), దేవంగ్ గాంధీ (ఈస్ట్ జోన్)లు మరో సీజన్ కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పదవీ కాలం ముగియనున్న ఎంఎస్‌కె ప్రసాద్, గగన్ ఖోర స్థానంలో మరో ఇద్దరిని తీసుకునేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 

ఎవరీ లక్ష్మణ్ శివరాకృష్ణన్..
దరఖాస్తు చేసుకున్నవారిలో ఒకరైన లక్ష్మణ్ శివరామకృష్ణన్ సెలెక్టర్స్ కమిటీకి ఎంపికైనట్టయితే.. సీనియర్ మోస్ట్ టెస్ట్ క్రికెటర్‌ అయిన లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ రేసులోనూ ఉన్నట్టేనని క్రీడావర్గాలు చెబుతున్నాయి. 1983లో ఆంటిగ్వేలో వెస్ట్ ఇండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో 17 ఏళ్ల వయస్సులోనే లక్ష్మణ్ శివరామకృష్ణన్ టెస్ట్ కెరీర్‌లోకి తెరంగేట్రం చేశాడు. 1985లో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10 వరకు ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలవగా.. అప్పటి లెగ్ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఆ ఛాంపియన్‌షిప్‌లో హీరో అనిపించుకున్నాడు. క్రికెట్ నుంచి వైదొలగిన తర్వాత 20 ఏళ్లుగా కామెంటేటర్‌గా ఉన్న లక్ష్మణ్ శివరామకృష్ణన్.. ఐసిసి క్రికెట్ కమిటీలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. నేషనల్ క్రికెట్ అకాడమీకి స్పిన్ బౌలింగ్ కోచ్‌గానూ పనిచేశాడు.  

ఎవరి బలాలు ఎంత..
శివరామకృష్ణన్ 9 టెస్ట్ మ్యాచ్‌లు, 16 వన్డేలు ( 25 అంతర్జాతీయ మ్యాచ్‌లు) ఆడగా.. సంజయ్ బంగర్‌ (2001-2004) ఖాతాలో 12 టెస్ట్ మ్యాచ్‌లు 15 వన్డేలు (27 ఇంటర్నేషనల్స్) ఉన్నాయి. వెంకటేష్ ప్రసాద్ విషయానికొస్తే...1994 నుంచి 2001 వరకు టీమిండియా జట్టులో కొనసాగిన రైట్ ఆర్మ్ పేసర్ వెంకటేష్ ప్రసాద్.. మొత్తం 33 టెస్ట్ మ్యాచ్‌లు, 161 వన్డేలతో అత్యధిక మ్యాచ్‌లు కలిగిన ఆటగాడిగా ఉన్నాడు. 

ఇక రాజేష్ చౌహన్ విషయానికొస్తే... 1990లో అనిల్ కుంబ్లె, వెంకటపతి రాజు వంటి సీనియర్ క్రికెటర్స్‌తో కలిసి ఆడిన చౌహన్ ఖాతాలో 21 టెస్ట్ మ్యాచులు, 35 వన్డేలు ఉన్నాయి. వీరిలో నేషనల్ సెలెక్టర్స్ కమిటీకి ఎంపికయ్యేది ఎవరు ? చీఫ్ సెలెక్టర్ పోస్టుకి ఎంపికయ్యేది ఎవరనే జవాబు తెలియాలంటే.. బీసీసీఐ నుంచి ప్రకటన వెలువడేవరకు వేచిచూడాల్సిందే మరి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More