Home> క్రీడలు
Advertisement

German Open 2022: ఒలింపిక్​ ఛాంపియన్​కు షాకిచ్చిన భారత యువకెరటం.. ఫైనల్లో లక్ష్యసేన్..

German Open 2022: జర్మన్​ ఓపెన్​ సూపర్ 300 బ్యాడ్మింటన్​ టోర్నమెంట్​ ఫైనల్లోకి ప్రవేశించాడు భారత యువకెరటం లక్ష్యసేన్. సెమీఫైనల్‌లో ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌పై విజయం సాధించాడు. 
 

German Open 2022: ఒలింపిక్​ ఛాంపియన్​కు షాకిచ్చిన భారత యువకెరటం.. ఫైనల్లో లక్ష్యసేన్..

German open 2022: జర్మన్ ఓపెన్ 2022 (German Open 2022) పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నం. 1, ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌కు (viktor axelsen) షాకిచ్చాడు భారత క్రీడాకారుడు లక్ష్యసేన్. 3 గేమ్‌లలో ఓడించి.. ఫైనల్ కు చేరుకున్నాడు లక్ష్యసేన్. ఆదివారం జరగనున్న ఫైనల్స్​లో థాయ్​లాండ్​కు చెందిన కున్లావుట్ విటిడ్‌సర్న్‌ను ఎదుర్కొన్నాడు. గంటకు పైగా సాగిన సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ 21-13, 12-21, 22-20తో విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇంతకముందూ వీరిద్దరూ నాలుగు సార్లు తలపడగా.. అన్నిసార్లు విక్టరే పైచేయి సాధించాడు. 

ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్...ఈ ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్‌లో (India Open) తన తొలి సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ 2022 సీజన్‌లో తన 2వ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం వచ్చింది. విటిడ్‌సర్న్‌పై సేన్ 3-3 హెడ్-టు-హెడ్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు, గత సంవత్సరం హైలో ఓపెన్‌లో ఇతడిపై గెలుపొందాడు లక్ష్యసేన్. 2018లో జరిగిన ఆసియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో సేన్ విటిడ్‌సర్న్‌ను ఓడించి స్వర్ణం సాధించాడు. 

Also Read: German Open 2022: క్వార్టర్‌ ఫైనల్‌కు శ్రీకాంత్​.. ఇంటిదారి పట్టిన సింధు, సైనా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More