Home> క్రీడలు
Advertisement

Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన కృష్ణ నగార్

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌-6లో కృష్ణ నాగర్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది. 
 

Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన కృష్ణ నగార్

Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ అథ్లెట్స్ అదరగొడుతున్నారు. అసాధారణ రీతిలో ప్రదర్శనను కనబరుస్తూ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌ 3 విభాగంలో ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ నిన్న పసిడిని ముద్దాడగా.. తాజాగా ఎస్‌హెచ్‌ 6 విభాగంలో కృష్ణ నాగర్‌ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నాగర్‌.. ఫైనల్లో హాంకాంగ్‌ షట్లర్‌ చు మన్‌ కైను 21-17, 16-21, 21-17తేడాతో మట్టికరిపించాడు. ఈ పతకంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 19కి చేరింది. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

పారాలింపిక్స్‌(Paralympics 2021) చరిత్రలో భారత్‌ తొలిసారి బ్యాడ్మింటన్‌లో పతకాలను సాధిస్తుంది. ఇందులో ఏకంగా 2 పసిడి(కృష్ణ నాగర్‌, ప్రమోద్‌ భగత్‌), రజతం(సుహాస్ యతిరాజ్), మరో కాంస్య(మనోజ్‌ సర్కార్‌) పతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పారాలింపిక్స్‌లో భారత్‌ ఈ స్థాయిలో(19) పతకాలు సాధించడం ఇదే తొలిసారి. 2016 రియో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన 4(2 స్వర్ణం, రజతం, కాంస్యం) పతకాలే ఇప్పటిదాకా అత్యుత్తమం. 

Also Read: Tokyo Paralympics: బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన Pramod Bhagat

రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు..
పారాలింపిక్స్‌(Paralympics)లో స్వర్ణాన్ని ముద్దాడిన కృష్ణ నాగర్‌(Krishna Nagar)ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ట్విటర్‌ వేదికగా అభినందించారు. ‘కృష్ణ నాగర్‌ చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో పతకం సాధించడం ద్వారా మువ్వన్నెల జెండా మరింత ఎత్తున రెపరెపలాడింది. మీ నుంచి ఎంతో మంది భారతీయులు ప్రేరణ పొందుతారు. అభినందనలు’ అని రాష్ట్రపతి(President) Ramanath Kovind) ట్వీట్‌ చేశారు. ‘పారాలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాణించడం ఎంతో సంతోషంగా ఉంది. కృష్ణ నాగర్‌(Krishna Nagar) సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడి ముఖంలో చిరునవ్వులను పూయించింది. బంగారు పతకం సాధించినందుకు కృష్ణ నాగర్‌కు అభినందనలు’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

పారాఒలింపియన్స్ తో ప్రధాని భేటీ!
ఇదివరకు ఒలింపిక్స్ విజేతలతో ఎలాగైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం అయ్యారో... అదే విధంగా... ఈసారి పారా ఒలింపిక్స్‌(Paralympics)లో సత్తా చాటిన భారతీయ ప్లేయర్లతో మోదీ(PM Modi) ప్రత్యేకంగా సమావేశం అవుతారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) తెలిపారు. దీని ద్వారా ప్లేయర్లలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడమే కాదు... నెక్ట్స్ ఒలింపిక్స్, ఇతర క్రీడల పట్ల దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. పారాలింపిక్స్ నేటితో ముగియనుండగా భారతీయ ఆటగాళ్లు అద్భుత ప్రతిభ చూపించడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More