Home> క్రీడలు
Advertisement

సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. 

సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలగవ టెస్టు మ్యాచ్‌లో అండర్‌సన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌లో‌(119) 6,000 రన్స్ చేసిన రెండవ ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండుల్కర్ (120 ఇన్నింగ్స్‌) రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఈ అరుదైన రికార్డును సాధించిన వారిలో మొదటి స్థానంలో సునీల్‌ గవాస్కర్‌ (117 ఇన్నింగ్స్) ఉండగా.. రెండవ స్థానంలో కోహ్లీ (119 ఇన్నింగ్స్) నిలవడం విశేషం.

కోహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ (120 ఇన్నింగ్స్), సెహ్వాగ్ (121 ఇన్నింగ్స్), ద్రవిడ్ (125 ఇన్నింగ్స్) ఉన్నారు. తన కెరీర్‌లో 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6000కు పైగా పరుగులను చేయడం గమనార్హం. ఈ పరుగుల్లో 23 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2017 సంవత్సరంలో శ్రీలంకతో ఢిల్లీ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ అత్యధికంగా 243 పరుగులు చేయడం విశేషం. 

ఇదే రికార్డును అంతర్జాతీయ స్థాయిలో చూస్తే.. టెస్టుల్లో 6000 పరుగులను అతి తక్కువ ఇన్నింగ్స్‌లో నమోదు చేసిన క్రికెటర్లలో డాన్ బ్రాడ్‌మన్ (68 ఇన్నింగ్స్) ఉన్నారు.  ఆయన తర్వాతి స్థానంలో సోబర్స్ (111 ఇన్నింగ్స్), ఎస్సీడీ స్మిత్ (111 ఇన్నింగ్స్), హామండ్ (114 ఇన్నింగ్స్) ఉన్నారు.

Read More