Home> క్రీడలు
Advertisement

KKR vs RR match highlights: రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. చెలరేగిన Shivam Mavi

KKR vs RR match highlights, IPL 2021 latest updates: శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ (SRH vs MI match today) కూడా ఇలాగే భారీ తేడాతో గెలవకపోయినట్టయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders into play offs) ప్లే ఆఫ్స్‌‌కి చేరేందుకు అది కలిసొచ్చే అంశం అవుతుంది.

KKR vs RR match highlights: రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తుగా ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. చెలరేగిన Shivam Mavi

KKR vs RR match highlights, IPL 2021 latest updates: ఐపిఎల్ 2021 దుబాయ్ షెడ్యూల్లో భాగంగా గురువారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రెచ్చిపోయింది. ప్లే ఆఫ్స్‌‌కి చేరాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో తామేంటో నిరూపించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టుకు బ్యాట్స్ మెన్ శక్తినివ్వగా.. ఆ శక్తికి కోల్‌కతా పేసర్లు సైతం తమ శక్తిని జోడించారు. మొత్తంగా సమిష్టి కృషితో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. మరోవైపు కోల్‌కతా బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు తలొంచకతప్పలేదు. 

మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌‌కి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయారు. రాహుల్ త్రిపాఠి (21), దినేష్ కార్తిక్ (14), ఇయాన్ మోర్గాన్ (13), నితీశ్ రానా (12) కొంతలో కొంత రాణించడంతో కోల్‌కతా జట్టు 171 పరుగులు చేసింది. 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డకౌట్ కాగా మరో ఓపెనర్ లియం లివింగ్‌స్టోన్ కేవలం 6 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అలా మొదలైన రాజస్థాన్ రాయల్స్ పతనం చివరి వరకు కొనసాగుతూనే ఉంది. శివం దూబే ఇన్నింగ్స్‌ని కొంత చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించినప్పటికీ.. శివం మావీ అతడి వికెట్ తీసి రాజస్థాన్‌కి మరోసారి బ్రేకేశాడు. ఆటగాళ్లు వరుసగా ఔట్ అవుతున్నా.. రాహుల్ తెవాటియా (Rahul Tewatia) 44 పరుగులు 5 ఫోర్లు, 2 సిక్సులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే, అతడి దూకుడుకు శివం మావి మరోసారి కళ్లెం వేసి రాజస్థాన్‌ని (Rajastan Royals) కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయిది. 

రాజస్థాన్ నడ్డి విరిచిన శివం మావి (4/21) కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్ (Shivam Mavi) వరించింది. ఫెర్గూసన్‌ (3/18) రాణించగా, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు. 

86 పరుగుల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 పాయింట్లతో నాలుగో బెర్త్‌కు అడుగు దూరంలో నిలిచింది. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ (SRH vs MI match today) కూడా ఇలాగే భారీ తేడాతో గెలవకపోయినట్టయితే.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders into play offs) ప్లే ఆఫ్స్‌‌కి చేరేందుకు అది కలిసొచ్చే అంశం అవుతుంది. లేదంటే ఇబ్బందులు తప్పేలా లేవు.

Read More