Home> క్రీడలు
Advertisement

క్రికెట్‌కు పీటర్సన్ గుడ్‌బై

క్రికెట్‌కు పీటర్సన్ గుడ్‌బై

క్రికెట్‌కు పీటర్సన్ గుడ్‌బై

లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మన్‌ కెవిన్‌ పీటర్సన్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం పీటర్సన్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున లాహోర్‌లో ఆడుతున్నాడు. ఇక తన పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయిస్తానని ఆయన ప్రకటించాడు. శనివారం ట్విటర్‌లో ‘‘ఇక సెలవు.. ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశాడు పీటర్సన్‌.

ఇంగ్లాండ్ టీమ్‌లో అత్యంత ప్రతిభావంతుడైన, అరుదైన క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్న ఈ 37 ఏళ్ల పీటర్సన్..  తన అంతర్జాతీయ క్రికెట్‌లో 104 టెస్టు మ్యాచ్‌లు, 136 వన్డేలు, 37 టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. తన కెరీర్‌లో 30 వేలకుపైగా  పరుగులు, 68 సెంచరీలు, 152 అర్ధసెంచరీలు ఉన్నాయి. ‘‘నేను ప్రొఫెషనల్‌ కెరీర్లో 30 వేలకు పైగా పరుగులు, 152 అర్ధసెంచరీలు, 68 సెంచరీలు చేసినట్లు ఎవరో ట్వీట్‌ చేశారు.

ఇంకా ఇంటా బయటా కలిపి 4 యాషెస్‌లు, టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో పాటు, భారత్‌పై భారత్‌లో సిరీస్‌ విజయం, బంగ్లాదేశ్‌ మినహా అన్ని టెస్టు దేశాలపై శతకాలు.. ఇలాంటి ఘనతలెన్నో సాధించాను. ఇవన్నీ నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి అంకితం. నేను సాధించిన అన్నింటికీ ఎంతో గర్వంగా ఉన్నా. క్రికెట్‌ అంటే నాకెంతో ప్రేమ’’ అని పీటర్సన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశాడు.

Read More