Home> IPL 2023
Advertisement

Sanju Samson Stunning Catch: సింగిల్ హ్యాండ్‌తో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

RR vs DC in IPL 2023: ఢిల్లీ vs రాజస్థాన్ రాయల్స్ జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్‌లో తమ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కి చుక్కలు చూపించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. చివరకు ఛేజింగ్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆరంభంలోనే ఫస్ట్ ఓవర్లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

Sanju Samson Stunning Catch: సింగిల్ హ్యాండ్‌తో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

Sanju Samson Stunning Catch Video got Viral: ఇండియన్ క్రికెట్ లో ది బెస్ట్ వికెట్ కీపర్స్ లో లేటెస్ట్ యువ కెరటం సంజూ శాంసన్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తాజాగా రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన ఐపిఎల్ 2013 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కేప్టేన్ సంజూ శాంసన్ మరోసారి నిరూపించుకున్నాడు. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన 12వ మ్యాచ్ లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఢిల్లీ ఓపెనర్ పృధ్వీ షా వికెట్ తీయడం కోసం సంజూ శాంసన్ కళ్లు మూసి తెరిసే వేగంతో డైవ్ చేసి మరీ సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ పట్టుకున్నాడు. 

సంజూ శాంసన్ క్యాచ్ పట్టిన తీరు అతడిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిసేలా చేసింది. ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా ఐపిఎల్ ప్రియులు సైతం సంజూ శాంసన్ క్రికెటింగ్ స్కిల్స్‌ని అభినందిస్తున్నారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా వికెట్ తీసిన ట్రెంట్ బౌల్ట్ అంతటితో సరిపెట్టుకోలేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో ఆ తరువాతి బంతికే మనీష్ పాండేను ఔట్ చేసి పెవిలియన్ బాట పట్టించాడు. అలా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరంభంలోనే నడ్డి విరిచాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్.

 

ఇది కూడా చదవండి: Fastest 50 in IPL 2023: ఐపిఎల్ 2023లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ అజింక్య రహానేదే.. ఎన్ని బంతుల్లోనో తెలుసా ?

అంతకంటే ముందుగా మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 200 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్స్ యశస్వి జైశాల్, జోస్ బట్లర్ ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేయడంతో వారికి సునాయసంగానే ఈ స్కోర్ సాధ్యమైంది. ఫస్ట్ ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో యశస్వి జైశ్వాల్ 20 పరుగులు రాబట్టాడు. అందులో హ్యాట్రిక్ ఫోర్లు కూడా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ తొలి 4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 50 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఓపెనర్లు ఇద్దరు బౌండరీలతో వరుసగా పరుగులు రాబట్టారు. ఒకనొక దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురు బౌలర్లను మార్చి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. యశస్వి జైశ్వాల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

ఇది కూడా చదవండి: David Warner Not Out: యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టినా.. డేవిడ్ వార్నర్‌కి ఔట్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More