Home> IPL 2023
Advertisement

PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..

PBKS Vs KKR Playing 11: ఐపీఎల్ శనివారం ఆసక్తికర పోరు జరగనుంది. పంజాబ్, కేకేఆర్ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్ల బలబలాలేంటి.? విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి..? తుది జట్లు ఎలా ఉండబోతుంది..? పిచ్ రిపోర్ట్ ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
 

PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..

PBKS Vs KKR Playing 11: క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. శుక్రవారం జరిగిన మొదటి మ్యాచ్ గుజరాత్-చెన్నై జట్లు మస్త్ మజాను అందించగా.. శనివారం జరిగే రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30 నుంచి మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగనున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ బాధ్యతలు చేపట్టగా.. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ గైర్హాజరీలో నితీష్ రానా కేకేఆర్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుంది..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? పూర్తి వివరాలు ఇలా..

పిచ్ రిపోర్ట్..

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదికగా పంజాబ్, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్ పండగ చేసుకునే అవకాశం ఉంది. భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయమని మాజీలు అంచనా వేస్తున్నారు. బౌలర్లకు కష్టాలు తప్పవని చెబుతున్నారు. 

హెడ్ టు హెడ్..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఇరు జట్లు మొత్తం 30సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 20 మ్యాచ్‌లు గెలిచింది. పంజాబ్ కింగ్స్ కేవలం 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రెండు జట్లు కొత్త సారథులతో బరిలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది. అయితే శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన సామ్ కర్రన్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. అదేవిధంగా జింబాబ్వే సంచలనం సికందర్ రాజా ఎలా ఆడతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.   

మరోవైపు గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమవ్వడం కోల్‌కత్తాకు మైనస్‌గా మారింది. అయినా వెంకటేష్ అయ్యర్, నితీష్‌ రాణా, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో విఫలమైన వెంకటేష్‌ అయ్యర్ ఈసారి సత్తాచాటుకోవాలని చూస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్, వరుణ్‌ చక్రవర్తిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

రెండు జట్లు ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), భానుక రాజపక్సే, జితేష్ శర్మ, షారుఖ్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్.

కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, నారాయణ్ జడాదిసన్, నితీష్ రాణా (కెప్టెన్), రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  

Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More