Home> IPL 2023
Advertisement

CSK Vs LSG: డోంట్ స్టాప్ వాచింగ్.. పూనకాలు లోడింగ్.. నేడు ఇంట్రెస్టింగ్ ఫైట్

CSK Vs LSG Match Preview: ఈ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. సొంతగడ్డపై మ్యాచ్‌ జరగడనుండడంతో తలైవా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.
 

CSK Vs LSG: డోంట్ స్టాప్ వాచింగ్.. పూనకాలు లోడింగ్.. నేడు ఇంట్రెస్టింగ్ ఫైట్

Chennai Super Kings Vs Lucknow Super Giants Match Preview: ఆదివారం అయిపోయింది. ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఉండవు. ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది.. టీవీలో వేరే సినిమాలు చూసుకుందామని అనుకుంటున్నారా..? డోంట్ స్టాప్ వాచింగ్.. పునకాలు లోడ్ అవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌.. చాలా రోజుల తరువాత సొంతగడ్డపై నేడు మ్యాచ్ ఆడబోతుంది. లక్నో సూపర్ జెయింట్‌తో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తలపడనుంది. ఐపీఎల్ 2023లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమిని చెన్నై చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఢిల్లీపై విజయంతో లక్నో ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్ ఎలా జరగబోతుంది..? ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..

పిచ్ రిపోర్ట్

చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  మ్యాచ్ జరగనుంది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కు సొంత మైదానం. ఈ పిచ్ చాలా స్లోగా ఉంటుంది. ఎక్కువగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. సీఎస్‌కే జట్టులో ఎక్కువ మంది నాణ్యమైన స్పిన్నర్లు ఉండడం కలిసి వచ్చే అంశం. సొంతగడ్డపై చెన్నైను ఓడించడం ప్రత్యర్థులకు ఎప్పుడు సవాలే.
సోమవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో తెలుగు కామెంట్రీతో వీక్షించవచ్చు. 'జియో సినిమా' యాప్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. మీరు ఈ యాప్‌లో ఈ మ్యాచ్‌ని ఉచితంగా చూడవచ్చు. ఇక్కడ కూడా వివిధ భాషల్లో కామెంట్రీ ఉంటుంది. 

తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరు పెద్దగా రాణించలేదు. డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ వంటి ఆటగాళ్లు చెలరేగాల్సి ఉంది. చివర్లలో ధోని తన స్టైల్‌లో ఫినిషింగ్ ఇచ్చినా.. అది జట్టు విజయానికి సరిపోలేదు. స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై చెన్నై జట్టు ఆశలు పెట్టుకుంది. ఇటీవల టీమిండియా తరుఫున బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన జడ్డూ.. ఐపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటోంది. బౌలింగ్‌లో సీఎస్‌కే బలంగానే కనిపిస్తోంది. దీపక్ చాహర్‌కు తోడు యంగ్ పేసర్ రాజవర్ధన్ హంగర్కేకర్ గత మ్యాచ్‌లో మూడు వికెట్లతో సత్తా చాటాడు.  

మరో వైపు కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో పటిష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో కైల్ మేయర్, పూరన్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు చేసింది. బౌలింగ్‌లో మార్క్‌ వుడ్ కేవలం 14 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో ఢిల్లీపై సునాయసంగా విజయం సాధించింది. రెండు జట్లు కూడా ప్లేయింగ్‌లో ఎలెవెన్‌లో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.

తుది జట్లు ఇలా (అంచనా)..:

చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, ఎంఎస్ ధోని (కెప్టెన్), దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, రాజవర్ధన్ హంగర్కేకర్.

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోనీ, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్.

Also Read: తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ ఓటమి.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More