Home> IPL 2023
Advertisement

IPL 2023: ఐపీఎల్ చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే

IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి ఎదురైనా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

IPL 2023: ఐపీఎల్ చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే

IPL 2023: తలైవా ట్రేడ్ మార్క్ షాట్లకు చెన్నై చేపాక్ స్డేడియం దద్దరిల్లింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ కెప్టెన్ ఎంఎంస్ ధోని మరసారి అదరగొట్టేశాడు. ఫైనల్ ఓవర్ సిక్సర్ల ఘనత దక్కించుకున్నాడు. ఐపీఎల్ చివరి ఓవర్లలో సిక్సర్లలో అదరగొట్టిన బ్యాటర్లు ఎవరెవరో తెలుసుకుందాం..

ఎంఎస్ ధోని-57 సిక్సర్లు

fallbacks

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అల్టిమేట్ ఫినిషర్ ఆఫ్ మ్యాచ్‌గా పేరు సంపాదించుకున్న ధోని ఐపీఎల్ చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకూ దోనీ చివరి ఓవర్లలో కొట్టిన సిక్సర్లు 57. 

కీరన్ పోల్లార్డ్-33 సిక్సర్లు

fallbacks

ముంబై ఇండియన్స్ జట్టు మాజీ ఆటగాడు ఆల్ రౌండర్ కీరన్ పోల్లార్డ్ ఐపీఎల్ చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్లలో రెండవ స్థానంలో నిలిచాడు. 

రవీంద్ర జడేజా-26 సిక్సర్లు

fallbacks

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారధి రవీంద్ర జడేజా 26 ఐపీఎల్ చివరి ఓవర్ సిక్సర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. 

హార్దిక్ పాండ్యా-25 సిక్సర్లు

fallbacks

ఐపీఎల్ చివరి ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో నాలుగవ స్థానలో నిలిచాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మొత్తం 25 సిక్సర్లు సాధించాడు.

రోహిత్ శర్మ-23 సిక్సర్లు

fallbacks

ఇక ఐపీఎల్ ఫైనల్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటి వరకూ 23 సిక్సర్లు బాదాడు.

Also read: CSK vs RR Highlights: తలైవా మ్యాజిక్.. రికార్డుస్థాయిలో వ్యూస్.. ధోని మెరుపులు ఎంతమంది చూశారంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More