Home> IPL 2023
Advertisement

IPL 2023: సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ కీలక మ్యాచ్, గెలిస్తేనే బరిలో నిలిచేది

IPL 2023: ఐపీఎల్ 2023 కీలకదశకు చేరుకుంటోంది. ఒక్కొక్కటిగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమిస్తున్నాయి. ఇవాళ జరగనున్న మ్యాచ్ ఆ జట్టుకు అత్యంత కీలకం కానుంది. గెలిస్తేనే ప్లే ఆఫ్ బరిలో నిలుస్తుందని తెలుస్తోంది. లేదంటే నిష్క్రమణకు మార్గం సుగమమైనట్టే.

IPL 2023: సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ కీలక మ్యాచ్, గెలిస్తేనే బరిలో నిలిచేది

IPL 2023:  హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియంలో సొంత పిచ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బరి నుంచి దాదాపు నిష్క్రమించడంతో ఇక ఈ మ్యాచ్ ఆర్సీబీకు కీలకం కానుంది. అందుకే గెలిస్తేనే నిలుస్తుందంటున్నారు. పూర్తి వివరాలు ఇలా..

ఐపీఎల్ 2023లో 12 మ్యాచ్‌లు ఆడి ఆరింట గెలుపు, ఆరింట పరాజయంతో 12 పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇవాళ్టి మ్యాచ్ చాలా కీలకం. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉప్పల్ స్డేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఆర్సీబీకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే నిష్క్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్ బరి నుంచి ఢిల్లీ కేపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా నిష్క్రమిస్తే పంజాబ్, కేకేఆర్ జట్లు దాదాపు అవకాశాల్ని కోల్పోయాయి. 

ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్‌లో నిలిచేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అవకాశాలెక్కువగా ఉంటాయి. ఓడినా అవకాశముంటుంది కానీ మే 21న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి. అది కూడా పూర్తిగా గ్యారంటీ ఉండదు. అందుకే ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్ బరిలో నిలిచేది. ఇవాళ్టి మ్యాచ్ ఓడితే..గుజరాత్ టైటాన్స్ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించడమే కాకుండా..రేపు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్, మే 20న జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై సీఎస్కే, కేకేఆర్‌పై లక్నో, మే 21న సన్‌రైజర్స్ చేతిలో ముంబై ఓడితే ప్లే ఆఫ్‌కు ఆర్సీబీకు అవకాశాలుంటాయి.

అప్పుడు కూడా రన్‌రేట్ ప్రాతిపదిక ఉండనే ఉంటుంది. గుజరాత్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధారణ విజయం సాధిస్తే ముంబై ఇండియన్స్‌తో పాటు సమానంగా 14 పాయింట్లు ఉంటాయి. అదే జరిగినే రన్‌రేట్ బాగున్న జట్టు గుజరాత్, సీఎస్కే, లక్నోలతో పాటు ప్లే ఆఫ్‌కు చేరుతుంది. పంజాబ్‌పై రాజస్థాన్, సన్‌రైజర్స్‌పై ముంబై గెలిచినా, ఢిల్లీ చేతిలో సీఎస్కే, కేకేఆర్ చేతిలో లక్నో ఓడినా సమీకరణాలు మారిపోతాయి. ఇప్పుడు ప్లే ఆఫ్ మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంటే 2,3,4 స్థానాల కోసం సీఎస్కే, లక్నో, ముంబై, ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. నెగెటివ్ రన్ రేట్ కారణంతో కేకేఆర్, పంజాబ్ జట్లకు 12 పాయింట్లు ఉన్నా..ప్లే ఆఫ్ అవకాశాల్ని దాదాపుగా కోల్పోయాయి.

Also read: PBKS vs DC: టాస్ గెలిచిన పంజాబ్.. స్టార్ ప్లేయర్స్ వచ్చేశారు! తుది జట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More