Home> IPL 2023
Advertisement

Today's IPL 2023 Match: చేపాక్ వేదికపై CSK Vs RR మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే!

CSK Vs RR: ఐపీఎల్ 2023లో మరో కీలకపోరు ఇవాళ జరగనుంది. చెన్నె చేపాక్ స్డేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. మరోసారి రెండు జట్లలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.

Today's IPL 2023 Match: చేపాక్ వేదికపై CSK Vs RR మ్యాచ్.. ఇరు జట్ల ప్లేయింగ్ 11 అంచనాలు ఇవే!

Today's IPL 2023 Match: చెన్నై సూపర్‌కింగ్స్ చేపాక్ స్డేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇవాళ తలపడనుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎంఎం ధోని నేతృత్వంలోని సీఎస్కే వరుస విజయాలు సాధించినా..కొన్ని గాయాలు మాత్రం ఆ జట్టుని వెన్నాడుతున్నాయి.

పేసర్ దీపక్ చాహర్ , ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇవాళ్టి మ్యాచ్‌లో సీఎస్కేకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయాల కారణంగా ఇవాళ్టి మ్యాచ్‌కు దూరమయ్యారు. నాలుగు సార్లు టైటిల్ గెల్చుకున్న సీఎస్కే తరపున ఆడేందుకు ఇద్దరు శ్రీలంక ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఒకరు మహీష్ తీక్షణ మరొకరు మతీషా పాతిరానా. ఈ ఇద్దరిలో ఆఫ్ స్పిన్నర్ తీక్షణ గత ఏడాది ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. 9 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు సాధించాడు. ఎకానమీ 7.46 కాగా యావరేజ్ 21.75 ఉంది.

చెన్నై చేపాక్ స్డేడియంలో పరిస్థితులు స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ధోనీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, తీక్షణ ఇద్దర్నీ ఆడించే అవకాశాలున్నాయి. అవసరమైతే మిచెల్ సాంట్నర్‌ను పక్కన పెట్టవచ్చు. ఇక డెవాన్ కాన్వే నాలుగవ విదేశీ ఆటగాడు కావడంతో డ్వెయిన్ ప్రెటోరియస్‌ను కూడా పక్కనపెట్టనున్నారు.

Also Read; DC Vs MI Highlights: హైఓల్టెజ్ మ్యాచ్.. ముంబై ఇండియన్స్‌ విక్టరీ.. ఢిల్లీకి నాలుగో ఓటమి

ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీకు రవీంద్ర జడేజా రూపంలో మరో స్పిన్ ఆప్షన్ ఉండనే ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఏ విధమైన గాయాల బెడద లేదు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హోం పించ్ కావడంతో ఆర్ఆర్ జట్టుకు అనుకూలం  కానుంది. మరోవైపు యజువేంద్ర చాహల్, మురుగన్ అశ్విన్ ఉండనే ఉన్నారు. మరోవైపు రెండు జట్లకు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ముందు బ్యాటింగ్ చేస్తే సీఎస్కే ముగ్గురు విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. 

చెన్నె సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11

డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే లేదా మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డ్వెయిన్ ప్రెటోరిస్, ఎంఎస్ ధోని, మిచెల్ శాంట్నర్, తీక్షణ లేదా సిమర్‌జిత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11

యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శామ్సన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మేయర్, ధృవ్ జూరెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ఎం అశ్విన్, ట్రెంట్ బోల్డ్ , యజువేంద్ర చాహల్

Also Read: Fastest 50 in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More