Home> IPL 2023
Advertisement

DC vs MI: టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2023లో శుభారంభం చేసేది ఎవరో!

Mumbai Indians have won the toss and have opted to field. ఐపీఎల్‌ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. 
 

DC vs MI: టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2023లో శుభారంభం చేసేది ఎవరో!

Delhi Capitals vs Mumbai Indians Playing 11: ఐపీఎల్‌ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఏ మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ కూడా ఆడడం లేదు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. 

ఐపీఎల్ 2023లో మేటి జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ అయితే ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల ఖాతాను తెరవనుంది. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 

ముంబై, ఢిల్లీ జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో ముంబై గెలుపొందగా.. ఢిల్లీ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం మ్యాచ్‌ జరిగే అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఇరు జట్లు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ఢిల్లీ  ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ముంబై నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మనీశ్ పాండే, యశ్‌ ధుల్, రోవ్‌మన్‌ పొవెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, అభిషేక్‌ పొరెల్, కుల్‌దీప్‌ యాదవ్, ఆన్రిచ్‌ నార్జ్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌. 
ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌) , ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహల్‌ వధేరా, హృతిక్ షోకీన్, రిలే మెరిడీత్, అర్షద్‌ ఖాన్‌, పీయూష్ చావ్లా, జేసన్‌ బెహ్రన్‌డార్ఫ్‌. 

Also Read: Anushka Sharma Cheerleader: భర్త కోసం చీర్‌లీడర్‌గా మారిన అనుష్క శర్మ.. వైరల్ పిక్స్!  

Also Read: Biggest Sixes In IPL: ఐపీఎల్ చరిత్రలోనే భారీ సిక్స్‌లు.. 125 మీటర్ల సిక్స్ కొట్టిందెవరో తెలిస్తే షాక్ అవుతారు! అస్సలు ఊహించరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More