Home> IPL 2023
Advertisement

Balakrishna Kohli Dialogue: అమ్మో విరాట్ కోహ్లీనా.. ఫైర్ బ్రాండ్! నందమూరి బాలకృష్ణ నోట ఫన్నీ డైలాగ్

Hero Nandamuri Balakrishna react about Cricketer Virat Kohli at IPL 2023. చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చేశారు. 
 

Balakrishna Kohli Dialogue: అమ్మో విరాట్ కోహ్లీనా.. ఫైర్ బ్రాండ్! నందమూరి బాలకృష్ణ నోట ఫన్నీ డైలాగ్

Hero Nandamuri Balakrishna react about Cricketer Virat Kohli at IPL 2023: మెగా టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నరేంద్ర మోడీ స్టేడియంలో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా నిర్వహించింది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా పోటీ పడ్డాయి.

మొన్నటివరకు టెలివిజన్, ఓటీటీలకు స్టార్ స్పోర్ట్స్ అధికారిక బ్రాడ్ కాస్టర్‌గా ఉంది. ఐపీఎల్ 2023లో హాట్‌స్టార్‌ స్థానంలో జియో సినిమా రేసులోకి వచ్చింది. దాంతో స్టార్ స్పోర్ట్స్, జియో మధ్య పోటీ తీవ్రంగా మారింది. క్యాంపైన్ నుంచి మొదలుకుని ప్రత్యక్ష ప్రసారాల వరకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా రేటింగ్స్ కోసం పోటీపడ్డాయి. క్రికెట్ స్టార్లతో సహా సినీ నటులతో కూడా ప్రోమోట్ చేశాయి. స్థానిక భాషల్లో అక్కడి సూపర్ స్టార్స్‌తో కామెంట్రీ చెప్పించాయి. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్ తెలుగు‌లో నందమూరి నటసింహం బాలకృష్ణతో మొదటి రోజు కామెంట్రీ చెప్పింది స్టార్ స్పోర్ట్స్. 

చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చేశారు. ఈ సందర్భంగా యాంకర్ వింధ్య విశాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అంటే వెంటనే గుర్తొచ్చే డైలాగ్ ఏంటి అని యాంకర్  అడగ్గా.. బాలయ్య బాబు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'అమ్మో.. ఫైర్ బ్రాండ్. ఎవడు నాకెదురొచ్చినా వాడికే రిస్క్.. నేను ఎవడికి ఎదురెళ్లినా వాడికే రిస్క్. తొక్కిపడేస్తా' అనే డైలాగ్ చెప్పారు బాలయ్యబాబు. ఈ డైలాగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డైలాగ్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. 

భోజ్‌పురి భాషలో మెగాస్టార్, ఎంపీ రవి కిషన్ తన వ్యాఖ్యానం అందించారు. రవి కిషన్ తెలుగు అభిమానులకు 'మద్దాలి శివా రెడ్డి'గా సుపరిచితమే. టాలీవుడ్ 'స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ నటించిన 'రేసుగుర్రం' సినిమాలో రవి కిషన్ విలన్‌గా నటించారు. రేసుగుర్రంలోని తన డైలాగ్ ను భోజ్‌పురి భాషలో చెప్పి అక్కడి ప్రేక్షకులను అలరించారు. రవి కిషన్‌ కామెంట్రీకి సంబంధించిన వీడియోలు, ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read: Best SUV under 10 Lakh: 10 లక్షలలోపు 5 సూపర్ ఎస్‌యూవీలు.. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్!  

Also Read: MG Comet Electric Car: టూ డోర్ ఎలక్ట్రిక్ కారు.. ఫుల్ ఛార్జ్‌తో 200కిమీ ప్రయాణం! సూపర్ ఫీచర్స్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More