Home> క్రీడలు
Advertisement

ఐపీఎల్‌ మళ్లీ వాయిదా. అసలు జరుగుతుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి వాయిదా పడింది. దేశంలో లాక్‌డౌన్‌ గడువును పొడిగించిన నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ మరోసారి వాయిదా వేశారు.

ఐపీఎల్‌ మళ్లీ వాయిదా. అసలు జరుగుతుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి వాయిదా పడింది. దేశంలో లాక్‌డౌన్‌ గడువును పొడిగించిన నేపథ్యంలో ఐపీఎల్‌ 13వ సీజన్‌ మరోసారి వాయిదా వేశారు. మే 3వరకు లాక్‌డౌన్‌ గడువును పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలవుతున్నాయి.  ‘అలాగైతే ధోనీ కష్టాలు రెట్టింపు’

మే3 తర్వాత పరిస్థితిని సమీక్షించి ఐపీఎల్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. వాస్తవానికి తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం మార్చి 29న ఐపీఎల్‌ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15కు ఐపీఎల్‌ వాయిదా వేయడం తెలిసిందే. Hardik Pandya ప్రేయసి హాట్ హాట్‌గా.. 

తాజా పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు నేటి ఉదయం ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఐపీఎల్‌ నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని మరోసారి ఐపీఎల్‌ను వాయిదా వేసింది. మే తర్వాత ఉండే బిజీ షెడ్యూళ్ల నడుమ ఐపీఎల్‌ నిర్వహణ ఏమేరకు సాధ్యపడుతుందో కాలమే సమాధానం చెబుతుంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

 

Read More