Home> క్రీడలు
Advertisement

MS Dhoni: చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న ధోనీ.. కొత్త సారథి ఎవరంటే?

IPL 2024: రేపు చెన్నై, బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. కొత్త సారథి ఎవరంటే?
 

MS Dhoni: చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకున్న ధోనీ.. కొత్త సారథి ఎవరంటే?

CSK New Captain news: ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎస్కే కెపెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రుతురాజ్ 2019 నుండి చెన్నైకు ఆడుతున్నాడు. ఆ జట్టులో కీలక ఆటగాడు. సీఎస్కే తరపున 52 మ్యాచులు ఆడాడు. అంతేకాకుండా ఆ జట్టు తరుపున ఒక సీజన్‌లో 635 పరుగులను సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు.   

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోని చెన్నై సూపరింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తూ వస్తున్నాడు. 2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్‌ చేసిన మినహా మిగతా అన్ని సీజన్లకు ధోనియే సారథిగా వ్యవహారించాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో జడేజాకు పగ్గాలు అప్పగించినప్పటికీ.. ఎనిమిది మ్యాచ్‌ల తర్వాత తిరిగి ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మహి చెన్నై తరుపున 212 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 

2023లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో ధోనీ నేతృత్వంలోని చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఐదోసారి టైటిల్‌ను గెలిచింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. మహి టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్‌ టైటిల్‌, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. 

సీఎస్కే జట్టు: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సిన్త్నర్, సిమరాంత్‌జీత్ సింగ్, సిమరాంత్‌జీత్ సింగ్. ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి.

Also Read: Water Crisis: ఐపీఎల్ మ్యాచ్‌లను వెంటాడుతున్న నీటి కష్టాలు.. అక్కడి మ్యాచులకు శుద్ధి చేసిన నీరు..

Also Read: ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్న టీమిండియా ప్లేయర్లు.. టాప్-5లో నలుగురు మనోళ్లే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More