Home> క్రీడలు
Advertisement

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. IPLలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క ఫ్లేయర్ గా ఘనత..

IPL 2024 Records: ఐపీఎల్ 2024 సీజన్ లో ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాయి. ఇప్పటి వరకు ఏ క్రికెటర్ కు సాధ్యం కాని ఫీట్ ను అతడు సాధించాడు. ఇంతకీ జడ్డూ సాధించిన రికార్డు ఏంటంటే?
 

Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. IPLలో ఆ రికార్డు సాధించిన ఒకే ఒక్క ఫ్లేయర్ గా ఘనత..

Ravindra Jadeja Creates history: ఐపీఎల్ 17వ సీజన్ లో రికార్డుల  మోత మోగిపోతున్నాయి. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టడం ద్వారా ఐపీఎల్‌ లో ఓ స్పెషల్ రికార్డును తన పేరిట లిఖించున్నాడు. 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో మరే క్రికెటర్ ఇలాంటి ఫీట్ ను సాధించలేదు. 

సోమవారం జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై సునాయసంగా గెలుపొందింది చెన్నై సూపర్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి  137 పరుగులు మాత్రమే చేసింది. జడేజా అద్భుతమైన బౌలింగ్ తో కేకేఆర్ నడ్డి విరిచాడు. స్టార్ హిట్టర్లయిన సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్‌లను పెవిలియన్ కు చేర్చాడు. ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్ క్యాచులు పట్టి ఔరా అనిపించాడు. కేకేఆర్ మ్యాచ్ కు ముందు జడ్డూ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. కేవలం నాలుగు మ్యాచుల్లో ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. బ్యాటింగ్ లో కూడా భారీ ఇన్నింగ్స్ ఆడింది లేదు. అతడు అత్తుత్యమ ఇన్నింగ్స్ 31 నాటౌట్. అయితే కేకేఆర్ మ్యాచులో అద్భుతమైన బౌలింగ్ చేసి మళ్లీ గాడిలో పడ్డాడు. 

Also Read: CSK vs KKR Highlights: కోల్‌కత్తా దూకుడుకు చెన్నై బ్రేక్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గట్టెక్కిన సీఎస్కే

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), అజింక్యా రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్, ఎంఎస్ ధోని(కీపర్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి, శారదుల్ థాకరి షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సమీర్ రిజ్వీ, డెవాన్ కాన్వే, ముస్తాఫిజుర్ రెహమాన్, నిశాంత్ సింధు, అరవెల్లి అవనీష్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జీత్ సింగ్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, మతీషా పతిరానా.

Also Read: Hardik Pandya: ఢిల్లీతో మ్యాచ్ లో హార్దిక్ ఎందుకు బౌలింగ్ చేయలేదు? అతడి గాయం మళ్లీ తిరగబెట్టిందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More