Home> క్రీడలు
Advertisement

IPL 2024 Auction LIVE: వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం.. భారీ ధర పలికిన కివీస్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్‌..

IPL 2024 Auction LIVE: ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ ఆల్-రౌండర్ డారిల్ మిచెల్‌ సత్తా చాటాడు. ఇతడిని రికార్డు స్థాయి ధరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఎంతంటే?
 

IPL 2024 Auction LIVE: వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం.. భారీ ధర పలికిన కివీస్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్‌..

IPL 2024 Auction LIVE updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో విదేశీ క్రికెటర్లపై కోట్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్‌ రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోయారు. తాజాగా కివీస్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ కు భారీగానే ధర పలికింది. ఈ ఆటగాడిని రూ.14 కోట్లు వెచ్చించి చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాపై మిచెల్ రెండు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. 

తాజా వేలంలో ఇతడిని దక్కించుకోవడానికి ముందుగా ఢిల్లీ, పంజాబ్ పోటీపడ్డాయి. రూ.11 కోట్లు వరకు రెండు టీమ్స్ బిడ్డింగ్ వేస్తూ వచ్చాయి. ఈ సమయంలో ఢిల్లీ వెనక్కుతగ్గగా.. చెన్నై రంగంలోకి దిగింది.  రూ.12 కోట్లతో వేలం స్టార్ట్ చేసింది. 13.75 కోట్ల వరకు పంజాబ్ వెళ్లగా.. రూ.14 కోట్లతో డారెల్ ను చెన్నై సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ లో డారెల్ 69.00 సగటు, 111.06 స్ట్రైక్ రేట్‌తో 552 పరుగులు చేశాడు. అంతేకాకుండా కివీస్ ను సెమీస్ కు చేర్చడంలో కీ రోల్ పోషించాడు. 

అత్య‌ధిక ధ‌ర ప‌లికింది వీళ్లే..
1. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – రూ.24.75 కోట్లు – కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్
2. ప్యాట్ క‌మిన్స్(ఆస్ట్రేలియా) – రూ.20.5 కోట్లు – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
3. డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – రూ. 14 కోట్లు – చెన్నై సూప‌ర్ కింగ్స్
4. హ‌ర్ష‌ల్ ప‌టేల్(భార‌త్) – రూ.11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్
5. అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్) – రూ. 11. 50 కోట్లు – రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు
6. రొవ్‌మ‌న్ పావెల్(వెస్టిండీస్) – రూ. 7.4 కోట్లు – రాజస్థాన్ రాయల్స్
7. ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) – రూ. 6.80 కోట్లు – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్
8. శివమ్ మావి(భారత్)- 6.40 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్
8. ఉమేశ్ యాద‌వ్(భార‌త్) –  రూ.  5.8 కోట్లు గుజ‌రాత్ టైటాన్స్
9. గెరాల్డ్ కోయెట్జీ (ద‌క్షిణాఫ్రికా) – రూ. 5 కోట్లు – ముంబై ఇండియ‌న్స్

అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా: 
ఫిల్ ఉప్పు
జోష్ ఇంగ్లిస్
కుశాల్ మెండిస్
లాకీ ఫోర్గూసన్
జోష్ హాజిల్‌వుడ్
వకార్ సలాంఖీల్
ఆదిల్ రషీద్
అకేల్ హుస్సేన్
ఇషా సోధి
తబ్రైజ్ షమ్సీ
ముజీబ్ ఉర్ రెహమాన్

Also Read: Mitchell Starc: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్, 24.75 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More