Home> క్రీడలు
Advertisement

GT vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజ‌రాత్.. తుది జట్లు ఇవే!

GT vs LSG IPL 2022 Toss: కొత్త జట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. 

 GT vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజ‌రాత్.. తుది జట్లు ఇవే!

IPL 2022 GT vs LSG Toss, Gujarat Titans opt to bowl: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్త జట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో కెఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయిట్స్‌ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. లక్నో ఇన్నింగ్స్‌ను కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఆరంభిస్తారు.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్‌కు కెప్టెన్‌ పాండ్యాపైనే నిలిచింది. ఇంతకుముందు ఐపీఎల్‌లో అతడు కెప్టెన్సీ చేయకపోవడమే అందుకు కారణం. అలానే ఈ మ్యాచ్‌లో ఇద్దరు అన్నదమ్ములు పోటీపడడం చూడొచ్చు. హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా లక్నో జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడేవారు. కానీ ఈసారి వేర్వేరు జట్లలో ఆడుతున్నారు.

తుది జట్లు:
గుజరాత్‌: శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (వికెట్‌ కీపర్‌), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ ఆరోన్, మహమ్మద్ షమీ. 
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్ (వికెట్‌ కీపర్‌), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోని, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్. 

Also Read: Radhe Shyam OTT: 'రాధేశ్యామ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌!

Also Read: GT vs LSG: ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి గుజరాత్, లక్నో.. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ వీరే! ఇక డబిడదిబిడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More