Home> క్రీడలు
Advertisement

MS Dhoni New look: ఎంఎస్ ధోనీ న్యూ లుక్ ఫొటో ట్రెండింగ్, Singham అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

MS Dhoni New look Photo: ఇటీవల కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఎంఎస్ ధోనీకి మరోసారి విశ్రాంతి లభించింది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ధోనీ న్యూ లుక్ ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. భార్య సాక్షి సింగ్ ధోనీ, కుమార్తె జీవాతో వెకేషన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

MS Dhoni New look: ఎంఎస్ ధోనీ న్యూ లుక్ ఫొటో ట్రెండింగ్, Singham అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

MS Dhoni New look : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన కుటుంబానికి అధిక సమయం కేటాయిస్తున్నాడు. ఇటీవల కరోనా కేసులు రావడంతో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో ఎంఎస్ ధోనీకి మరోసారి విశ్రాంతి లభించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంఎస్ ధోనీ సారథిగా వ్యవహరిస్తూ మూడు పర్యాయాలు ఐపీఎల్ ట్రోఫీని సైతం అందించాడు.

ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న ధోనీ న్యూ లుక్ ఫొటోలు ట్రెండింగ్ అవుతున్నాయి. భార్య సాక్షి సింగ్ ధోనీ, కుమార్తె జీవాతో వెకేషన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్‌లో కన్నానే కన్నే విజిల్ పోడు, ఎల్లో లవ్ అని కుమార్తె జీవాతో ధోనీ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. మీసాలతో ధోనీ క్రేజీ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ధోనీ తన లుక్, హెయిర్ సైల్స్ మారుస్తూ ట్రెండ్ క్రియేట్ చేశాడు.

Also Read: WTC Final: ఎంఎస్ ధోనీని వెనక్కి నెట్టిన Virat Kohli, ఆసియాలో నెంబర్ వన్‌గా Team India కెప్టెన్

ధోనీ ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఆయన భార్య సాక్షి ధోనీ షేర్ చేసిన వీడియో సైతం ట్రెండింగ్ అవుతోంది. కర్రలతో కట్టిన ఇంట్లో వెకేషన్ ఏర్పాటు చేసుకుని సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు ధోనీ. ఆ ఇల్లు చూస్తే మీకు కూడా అలాంటి ప్రదేశంలో వెకేషన్ ప్లాన్ చేయాలని అనిపిస్తుంది. ధోనీ లుక్ చూసిన అభిమానులు సింగమ్ అని కామెంట్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో యూఏఈలో తిరిగి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021లో మళ్లీ మైదానంలో ధోనీని చూస్తామనుకున్నాం, అంతకుముందే దర్శనమిచ్చావు తలా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: WTC Final Interesting Facts: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 5 ఆసక్తికర విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More