Home> క్రీడలు
Advertisement

IPL 2021 Latest News: కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని యోచిస్తున్న BCCI

BCCI Considering IPL 2021 Matches Can Be Held In These Two States: ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే.

IPL 2021 Latest News: కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఐపీఎల్ 2021 నిర్వహించాలని యోచిస్తున్న BCCI

IPL 2021 Latest News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021(IPL 2021 Auction) మినీ వేలం ఇటీవల ముగిసింది. ప్రస్తుతం ఈ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్, వేదికల గురించి చర్చ మొదలైంది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతున్న క్రమంలో గత ఏడాది ఆటగాళ్ల ఆరోగ్యం కోసం యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే.

ఐపీఎల్ 2021 నిర్వహణ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. కేవలం రెండు రాష్ట్రాల్లోని వేదికలలో తాజాగా సీజన్ మ్యాచ్‌లు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) యోచిస్తుంది. నేటికీ దేశంలో కరోనా ప్రభావం ఉండటంతో ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లోని మైదానాలే ఐపీఎల్ 2021(IPL 2021) నిర్వహణకు వేదికలుగా మారబోతున్నాయి. 

Also Read: IPL 2021 Auction Latest Updates: ఐపీఎల్ 2021 మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే

ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముంబై నగరంలోని నాలుగు స్టేడియాలలో గ్రూప్ దశ మ్యాచ్‌లను నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ పెద్దలు, ఐపీఎల్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. మరోవైపు మోతెరాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఐపీఎల్ 2021లో కీలకమైన ప్లే ఆఫ్స్ సహా ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ప్రాథమికంగా బీసీసీఐ(BCCI) అధికారులు చర్చలు జరిపారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఐపీఎల్ 14ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

Also Read: IPL 2021 Auction: ఐపీఎల్ 2021లో Sunrisers Hyderabad మొత్తం ఆటగాళ్ల జాబితా ఇదే

ముంబైలో బ్రబౌర్న్ స్టేడియం, వాంఖెడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, రిలయన్స్ క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. ఈ నాలుగు స్టేడియాలలో ఐపీఎల్ 2021 లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించడం ఉత్తమమని బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపారని ఐఏఎన్ఎస్‌ మీడియాకు ఓ అధికారి తెలిపారు. అయితే ఇప్పటివరకూ తుది నిర్ణయం తీసుకోవలేదని, త్వరలో ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయనుందని చెప్పారు.

Also Read: Novak Djokovic: ఆస్ట్రేలియా ఓపెన్ 2021 మెన్స్ సింగిల్స్ విజేత నొవాక్ జకోవిచ్

కరోనా అనంతరం ఇటీవ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని బీసీసీఐ దేశంలోనే నిర్వహించింది. తాజాగా విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండటంతో అత్యంత ఖరీదైన టోర్నీ ఐపీఎల్ టీ20ని సైతం తాము ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించగలమని బీసీసఐ పెద్దలు ధీమాగా ఉన్నారని సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More