Home> క్రీడలు
Advertisement

Hardik Pandya: కేఎల్ రాహుల్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హార్దిక్ పాండ్యా

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.

Hardik Pandya: కేఎల్ రాహుల్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హార్దిక్ పాండ్యా

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం. చివరి ఓవర్లలో పోలార్డ్, తాను ఆడిన ఇన్నింగ్స్ పట్ల తనకు చాలా గర్వంగా ఉందన్నాడు హార్దిక్ పాండ్యా.

పాండ్యా, పోలార్డ్‌లు కేవలం 23 బంతుల్లోనే అబేధ్యమైన 67 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 18వ ఓవర్లో 18 పరుగులు, 19వ ఓవర్లో 19 పరుగులు, చివరి ఓవర్‌లో 4 సిక్సర్లు బాదడంతో ముంబై 191 పరుగులు చేసింది. దీనిపై పాండ్లా మాట్లాడుతూ... ‘చాలా సందర్భాలలో నేను, పోలార్డ్ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాం. బ్యాటింగ్‌ను కచ్చితంగా ఎంజాయ్ చేశా. భారీ స్కోరు చేయాలనుకుంటే నేను హార్డ్ హిట్టింగ్ చేయాలని భావించాను.   

చివర్లో మేం ఆడిన మెరుపు ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ జట్టుకు భారీ లక్ష్యం ఎదురైంది. పెద్దన్న పోలార్డ్ మరోసారి చెలరేగిపోయాడు. అందుకు నేను జత కలిశాను. అయితే చివరి ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్‌కు పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బంతిని అందించడం సరైన నిర్ణయం కాదు. ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం నాకు తేలిక. అయితే ఈసారి బ్యాటింగ్ ఆ బాధ్యత నిర్వర్తించాడంటూ’ పంజాబ్‌పై విజయంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More