Home> క్రీడలు
Advertisement

Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tim Seifert: కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ యువ హిట్టర్

Tim Seifert replaces injured Ali Khan in KKR Team: న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 (IPL 2020) లో ఈ రోజు సాయంత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా జట్టులోకి న్యూజిలాండ్ వికెట్ కీపర్, యువ హిట్టర్ చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) ఫ్రాంఛైజీతో ఒప్పందం చేసుకున్న అమెరికా తొలి క్రికెటర్‌గా నిలిచిన  అలీ ఖాన్‌ గాయంతో కొద్దిరోజుల క్రితం  టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తాజాగా అలీఖాన్‌ స్థానంలో 25 ఏళ్ల న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫెర్ట్‌ను కోల్‌కతా ఫ్రాంఛైజీ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాంచైజీ ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించింది. టీమ్ సీఫెర్ట్‌ను స్వాగతం పలుకుతూ ట్విట్ చేసింది. Also read: Dwayne Bravo: ఐపీఎల్ 2020 నుంచి డ్వేన్ బ్రావో ఔట్

అయితే.. ఇటీవల గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన అలీఖాన్‌తోపాటు సీఫెర్ట్‌ (Tim Seifert) కూడా బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నేతృత్వంలోని కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో జట్టు తరఫున ఇంతకుముందు ఆడాడు. గత సెప్టెంబర్‌లో జరిగిన సీపీఎల్‌ విజేతగా ట్రిన్‌బాగో నిలువగా సీఫర్ట్‌ 9 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 133 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ కేకేఆర్ సీఫెర్ట్‌ను జట్టులోకి తీసుకుంది. 

ఈ రోజు రాత్రి 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగే 39వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేన, ఇయాన్ మోర్గాన్ సేన తలపడనున్నాయి. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 5 విజయాలతో 4వ స్థానంలో ఉంది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More