Home> క్రీడలు
Advertisement

MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ (MS Dhoni records 100 wins as captain for CSK) అయ్యాడు ధోనీ. ఓ ఫ్రాంచైజీ తరఫునగానీ, లేక ఓవరాల్ ఐపీఎల్‌లోగానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే.

MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే జట్టు (CSK)కు 100వ విజయం అందించిన అందించిన కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక కెప్టెన్ సైతం ధోనీనే కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ .. అనంతరం తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే జట్టును విజయపథంలో నడిపించాడు. కాగా, అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయడం సైతం ధోనీకి లాభించే అంశం. Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. క్షీణించిన వెండి ధర

అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) విజయంతో బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించడం తెలిసిందే. ముంబైపై విజయం సాధించడంతో ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఓ సీజన్‌లో రైజింగ్ పుణే జెయింట్స్‌కు సైతం ధోనీ కెప్టెన్సీ చేశాడు. 2016, 17 సీజన్లలో చెన్నైపై నిషేధం ఉంది. IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో సీఎస్కే 19.2 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి విజయాన్ని అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన సీఎస్కే ఆటగాడు అంబటి రాయుడు (71, 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అందుకున్నాడు. CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే!

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More