Home> క్రీడలు
Advertisement

IPL 2020: అక్కడ మ్యాచ్ అంత ఈజీ కాదుగా..మరింత ఆలస్యమా ?

ఐపీఎల్ టోర్నీ( Ipl tourney ) షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబిలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలే దీనికి కారణం. బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయం కసం ఆలోచిస్తోంది.

IPL 2020: అక్కడ మ్యాచ్ అంత ఈజీ కాదుగా..మరింత ఆలస్యమా ?

ఐపీఎల్ టోర్నీ( Ipl tourney ) షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబిలో అమల్లో ఉన్న అత్యంత కఠినమైన కోవిడ్ నిబంధనలే దీనికి కారణం. బీసీసీఐ ఇప్పుడు ప్రత్యామ్నాయం కసం ఆలోచిస్తోంది.

యూఏఈ ( UAE ) లో నిర్వహించబోతున్న ఐపీఎల్ 2020 ( Ipl 2020 ) టోర్నీ తేదీలైతే ఖరారయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అబుదాబి ( Abudabi ) లో కఠినమైన కోవిడ్ నిబంధనలున్నాయి. దుబాయ్ ( Dubai ), షార్జా ( Sharjah ) లతో పోలిస్తే అబుదాబిలో ఆంక్షలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ మ్యాచ్ లు నిర్వహించాలా వద్దా అని బీసీసీఐ ( BCCI ) ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మ్యాచ్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఇది మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ లో పాల్గొననున్న  8 టీమ్ లు గల్ఫ్ లో ల్యాండ్ అవగా..ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్లు మాత్రమే అబుదాబి బేస్ గా ఉన్నాయి. మిగిలిన ఆరు జట్టుల దుబాయ్ లో ఉంటున్నాయి. 

5 రోజులకు ఓసారి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని బీసీసీఐ నిబంధన ఉన్నా...అబుదాబిలో మాత్రం ఇంతకంటే కఠినంగా ఉంది. అబుదాబిలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఎంట్రీ పాయింట్ వద్ద కచ్చితంగా పరీక్ష చేయించుకోవల్సిందే. 50 దిర్ హమ్ లు చెల్లిస్తే వెంటనే పరీక్ష చేస్తారు. 48 గంటల వరకూ ఈ  రిపోర్ట్ పని చేస్తుంది. మ్యాచ్ అధికారులు, కామెంటేటర్లు, టీవీ సిబ్బంది, ఈవెంట్ మేనేజ్మెంట్ సిబ్బంది రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుంది. దుబాయ్ బేస్ లో ఉన్న జట్లతో అబుదాబిలో మ్యాచ్ ల నిర్వహణ కష్టసాధ్యంగా మారనుంది. సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ లోడిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ( Mumbai indians ) తో చెన్నై సూపర్ కింగ్స్ ( Chenna super kings ) తలపడనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సమస్యను పరిష్కరించి కొత్త మ్యాచ్ షెడ్యూల్ విడుదల చేయాలంటే...దుబాయ్ లో క్వారెంటైన్ లో ఉన్న ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ( Ipl governing council chairman brijesh patel ) చేయాలి. అందుకే మ్యాచ్ షెడ్యూల్ మరింత ఆలసమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Also read: Chris Gayle: విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్‌‌కు కరోనా నెగటివ్.. త్వరలో మరో పరీక్ష

 

Read More