Home> క్రీడలు
Advertisement

3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

ఈ మ్యాచ్‌లో అనవసర రనౌట్ తప్పిదాలు, మిచెల్ మార్ష్ గాయపడటం, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) రాణించకపోవడం సన్‌రైజర్స్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు.

3D Player Vijay Shankar: ఒక్క బంతికి 10 పరుగులు ఇచ్చిన విజయ్ శంకర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2020)లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)పై విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో అనవసర రనౌట్ తప్పిదాలు, మిచెల్ మార్ష్ గాయపడటం, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ (Vijay Shankar) రాణించకపోవడం సన్‌రైజర్స్ ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. SRH vs RCB, IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరుని గెలిపించింది ఎవరు ?

5వ ఓవర్ వేస్తున్న మిచెల్ మార్ష్ నాలుగు బంతుల తర్వాత గాయపడ్డాడు. కాలినొప్పితో మైదానాన్ని వీడాడు. రెండు బంతులు వేసి ఓవర్ పూర్తిచేసే బాధ్యతను విజయ్ శంకర్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అప్పగించాడు. కానీ విజయ్ శంకర్ (3D Player Vijay Shankar) వస్తూనే నోబాల్ వేశాడు, ఆపై మరో నో బాల్ .. ఈ బంతిని స్టాండ్స్‌లోకి పంపించి సిక్స్‌గా మలిచాడు ఆరోన్ ఫించ్. తర్వాతి బంతికి సింగిల్, ఆ తర్వాతి బంతి వైడ్ వేసి సన్‌రైజర్స్ అభిమానుల ఓపికను పరీక్షించాడు. Virender Sehwag: ఆ అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం

ఇలా ఒకే బంతి పరిగణనలోకి వచ్చింది. అయితే 3D ప్లేయర్ విజయ్ శంకర్ మాత్రం 10 పరుగులు ఇచ్చేశాడు. చివరి బంతిని డాట్ చేశాడు. 11వ ఓవర్ చివరి బంతికి హాఫ్ సెంచరీ చేసిన ఆర్సీబీ బ్యాట్స్‌మన్ పడిక్కల్ ను క్లీన్ బౌల్డ్ చేసి సన్‌రైజర్స్‌కు తొలి వికెట్ అందించాడు. బ్యాటింగ్‌లోనూ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యి జట్టు ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు విజయ్ శంకర్. అతడిని జట్టులోకి ఎందుకు తీసుకుంటారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. KXIP Short Run: పంజాబ్ కొంప ముంచిన షార్ట్ రన్.. అంపైర్ల తప్పిదానికి భారీ మూల్యం  

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More