Home> క్రీడలు
Advertisement

మెరిసిన పాండ్యా సోదరులు.. ముంబాయి గెలుపు

టీ20 లీగ్ 2018లో భాగంగా మధ్యప్రదేశ్ హోల్కర్ స్టేడియం వేదికగా శుక్రవారం ముంబై ఇండియ‌న్స్ , కింగ్స్ లెవెన్ పంజాబ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబాయి జట్టు చేధించింది.

మెరిసిన పాండ్యా సోదరులు.. ముంబాయి గెలుపు

టీ20 లీగ్ 2018లో భాగంగా మధ్యప్రదేశ్ హోల్కర్ స్టేడియం వేదికగా శుక్రవారం ముంబై ఇండియ‌న్స్ , కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ముంబాయి జట్టు చేధించింది. కాగా, టాస్ గెలిచిన ముంబాయి ఫీల్డింగ్ ఎంచుకోవ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్లకు ఆరు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ క్రిస్ గేల్ రెండు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 50 పరుగులు సాధించాడు. చివర్లో స్టోయినస్ రెండు సిక్స్‌లు, రెండు బౌండరీలు బాదడంతో 29 పరుగులు చేశాడు. రాహుల్ (24), కరణ్ నాయర్ (23)  ధాటికి పంజాబ్ 174 పరుగులు చేసింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ఓపెనర్ సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి మంచి ఆరంభాన్ని అందించాడు. యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యకుమార్ మూడు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 57 పరుగులు చేశాడు. కృనాల్ పాండ్య 12 బంతుల్లోనే రెండు సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 31 పరుగులు సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 24 పరుగులు చేయగా.. హార్దిక్ పాండ్య 22, లెవిస్ 10, ఇశాన్ కిషాన్ 25 పరుగులు చేశారు. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబాయి 19 ఓవ‌ర్లలో నాలుగు వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై ముంబై విజ‌యం సాధించింది.

Read More