Home> క్రీడలు
Advertisement

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ బోణీ..వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పంచ్..!

CWG 2022: బర్మింగ్ హామ్‌ వేదికగా కామన్వెల్త్ గేమ్స్‌ కొనసాగుతున్నాయి. ఈక్రీడల్లో భారత్ ఖాతా తెరిచింది. సంకేత్ సర్గార్‌ తొలి పతకాన్ని అందించాడు.

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ బోణీ..వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పంచ్..!

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ తొలి పతకాన్ని సాధించింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం దక్కింది. వెయిట్ లిఫ్టర్ సంకేత్ సర్గార్ 55 కేజీల విభాగంలో అదరగొట్టాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో 135 కేజీలు, స్నాట్చ్‌లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 248 కేజీలు ఎత్తడం ద్వారా రెండో స్థానంలో నిలిచాడు. సిల్వర్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తొలి ప్రయత్నంలో సర్గార్‌ 135 కేజీలు ఎత్తాడు. 

ఐతే మిగిలిన రెండు ప్రయత్నాల్లో ఆ సంఖ్యను అందుకోలేకపోయాడు. ఇటు మలేషియా ప్లేయర్ బిన్ మహమద్ అనిఖ్ కేవలం ఒకే ఒక్క కేజీ అదనంగా ఎత్తాడు. దీంతో స్వర్ణ పతకం అతడికి అందింది. అనిఖ్‌..స్నాచ్‌లో 107 కేజీలు మాత్రమే ఎత్తగలిగాడు. క్లీన్ అండ్‌ జెర్క్‌లో 142 కేజీలు ఎత్తాడు. దీంతో మొత్తం 249 కేజీల బరువు ఎత్తి..గోల్డ్ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. మరోవైపు శ్రీలంక ప్లేయర్ దిలాంక ఇసురు కుమార యోదగే మూడో స్థానంలో నిలిచాడు. 225 కేజీలు ఎత్తడం ద్వారా కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 

Also read:India vs West Indies: టీమిండియా ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఫీల్డింగ్..వీడియో వైరల్..!

Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు..విదేశాల్లో ఏం జరిగింది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Read More