Home> క్రీడలు
Advertisement

IND vs ZIM: టీమిండియాదే బ్యాటింగ్.. సిరాజ్, ప్రసిధ్ ఔట్! రెండు మార్పులతో బరిలోకి జింబాబ్వే

India vs Zimbabwe 3rd ODI Toss, India opt to bowl. భారత్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
 

IND vs ZIM: టీమిండియాదే బ్యాటింగ్.. సిరాజ్, ప్రసిధ్ ఔట్! రెండు మార్పులతో బరిలోకి జింబాబ్వే

India vs Zimbabwe: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. పేసర్లు ప్రసిధ్ కృష్ణ, మొహ్మద్ సిరాజ్ స్థానంలో దీపక్ చహర్, అవేశ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ ఇప్పటికే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది.మూడో వన్డేలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలుపొందాలని జింబాబ్వే ఉవ్విళ్లూరుతోంది. సొంత గడ్డపై టీమిండియాపై జింబాబ్వే 2010లో చివరిసారిగా వన్డేలో గెలిచింది. మూడో వన్డేలో విజయం సాధించాలంటే జింబాబ్వే ఆటగాళ్లు అద్బుతం చేయకతప్పదు. 

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 12:45 ప్రారంభం కానుంది. భారతదేశంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మూడో వన్డే లైవ్‌ స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు సోనీలివ్ వెబ్‌సైట్ మరియు యాప్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌ వికెట్ ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలర్లకు సహకరించనుంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, సంజూ శాంసన్‌ (కీపర్), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్, దీపక్ చహర్, అవేశ్ ఖాన్. 
జింబాబ్వే: ఇన్నోసెంట్ కైయా, టకుడ్జ్వానాషే కైటానో, టోనీ మున్యోంగా, రెగిస్‌ చకాబ్వా (కెప్టెన్‌), సీన్ విలియమ్స్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యాయుచి, రిచర్డ్ నగరవ. 

Also Read: Vijay Devarakonda Mother Video: మాది దొరల ఫ్యామిలీ..మేము దొరసానులం!

Also Read: Munugode Bypoll: 5 వందలు.. మందు.. మటన్ బిర్యానీ! జనాలకు ఉపాధినిస్తున్న మునుగోడు ఉపఎన్నిక 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Read More