Home> క్రీడలు
Advertisement

ఇండియా vs విండీస్ 2వ వన్డే: వైజాగ్ వన్డే మ్యాచ్‌ పూర్తి వివరాలు

వైజాగ్ వన్డే మ్యాచ్‌లో పాల్గొనే టీమిండియా జట్టు ఆటగాళ్లు వీళ్లే.. 

ఇండియా vs విండీస్ 2వ వన్డే: వైజాగ్ వన్డే మ్యాచ్‌ పూర్తి వివరాలు

రేపు బుధవారం విశాఖపట్నంలోని డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో విండీస్‌తో జరగనున్న 2వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆడనున్న ఆటగాళ్ల జాబితాను తాజాగా బీసీసీఐ విడుదల చేసింది. గౌహతిలో మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడిన జట్టు ఆటగాళ్ల పేర్లనే ఈ వన్డే మ్యాచ్‌లోనూ పరిగనణలోకి తీసుకున్నట్టు బీసీసీఐ స్పష్టంచేసింది. మొదటి వన్డేలో బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. 

రేపటి వన్డేలో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా:
విరాట్ కోహ్లీ (కెప్టేన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, సయ్యద్ ఖలీల్ అహ్మెద్.

మ్యాచ్ వేదిక:
విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-వైజగ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) క్రికెట్ స్టేడియం

తేదీ, సమయం:
అక్టోబర్ 24, బుధవారం, మధ్యాహ్నం 1:30 గంటలకు 

ఏ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది ?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ ఈ వన్డే మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 

మ్యాచ్ ప్రారంభమైన అనంతరం లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.
https://www.cricketcountry.com/series/west-indies-in-india-2018-200975/live-scores/india-vs-west-indies-2nd-odi-match-187759-summary.html

Read More