Home> క్రీడలు
Advertisement

India vs West Indies: నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. అందరి దృష్టి వారిపైనే!

India vs West Indies: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో ఓడిన తర్వాత కరీబియన్‌ గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు రెడీ అయింది టీమిండియా. మరోవైపు 2023-25 డబ్ల్యూటీసీ చక్రంలో భారత్‌కు ఇదే తొలి సిరీస్‌.
 

India vs West Indies: నేటి నుంచే వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. అందరి దృష్టి వారిపైనే!

India vs West Indies 1st Test Live: నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడేందుకు రెడీ అయింది టీమిండియా. 2023 WTC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్టు సిరీస్ ఇదే.  రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా.. తొలి టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. రోజోలోని విండ్సర్‌ పార్క్‌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా మరో ఫీట్ సాధించనున్నాడు అశ్విన్. మరో మూడు వికెట్లు తీస్తే 700 అంతర్జాతీయ వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ నిలుస్తాడు. 

విండీస్‌తో తొలి టెస్టులో 21 ఏళ్ల యశస్వి జైస్వాల్‌ అరంగేట్రం చేయబోతున్నాడు. ఇతడు రోహిత్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగబోతున్నాడు. యశస్వి కోసం  ఓపెనింగ్‌ స్థానాన్ని వదులుకుని పుజారా ఖాళీ చేసిన మూడో స్థానంలో ఆడబోతున్నాడు శుభ్‌మన్‌ గిల్. మరోవైపు ఇషాన్‌ కిషాన్‌కూ కూడా తొలి టెస్టు ఆడే అవకాశం దక్కొచ్చు. మరోవైపు టెస్టుల్లో విఫలమవుతూ వస్తున్న ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ ఈ మ్యాచ్ లో తీసుకుంటారా లేదనేది తెలియాల్సి ఉంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లైనా కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, రహానె బ్యాట్‌తో రాణించి కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. 

మరోవైపు భారత్ పేస్ దళాన్ని నడిపించే బాధ్యత సిరాజ్ పై పడింది. ఇతడికి తోడుగా శార్దూల్‌,  జైదేవ్‌ ఉనద్కత్‌, నవ్‌దీప్‌ సైని, ముకేష్‌ కుమార్‌ ఉన్నారు. మరోవైపు స్పిన్ బాధ్యతలు అశ్విన్‌, జడేజా పంచుకుంటారు. ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పాలి. ఇటీవల ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ ఈ సిరీస్ లో ఏ మేరకు నిలబడుతుందన్నది ఇక్కడ తలెత్తున్న ప్రశ్న. మరోవైపు వెస్టిండీస్ బ్యాటింగ్ భారం కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌తో పాటు త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌, బ్లాక్‌వుడ్‌ పైనే పడనుంది. అయితే బౌలింగ్ లో మాత్రం విండీస్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. కీమర్‌ రోచ్‌, గాబ్రియల్‌, అల్జారి జోసెఫ్‌, హోల్డర్‌ వంటి బౌలర్లు భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. భారీకాయుడైన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రఖీమ్‌ కార్న్‌వాల్‌ ఆ జట్టులో ప్రత్యేక ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు.

భారత తుది జట్టు(అంచనా): భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, శుభ్‌మన్‌, కోహ్లి, రహానె, కేఎస్‌ భరత్‌/ఇషాన్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌, సిరాజ్‌, ముకేష్‌/ఉనద్కత్‌
వెస్టిండీస్‌ తుది జట్టు(అంచనా): బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), త్యాగ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌, రీఫర్‌, రఖీమ్‌ కార్న్‌వాల్‌, బ్లాక్‌వుడ్‌, అథనేజ్‌, జోష్వా ద సిల్వా, హోల్డర్‌, అల్జారి జోసెఫ్‌, కీమర్‌ రోచ్‌, షనోన్‌ గాబ్రియల్‌

Also read: Ind Vs WI Records: అనిల్ కుంబ్లే తెగింపు.. విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ.. విండీస్‌పై గుర్తుండిపోయే క్షణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More