Home> క్రీడలు
Advertisement

IND vs SA Dream11 Prediction: అక్షర్, చహల్, అవేశ్ అవుట్.. టీమిండియా తుది జట్టు ఇదే! డ్రీమ్ ఎలెవన్ టీమ్..

India vs South Africa 3rd T20I Playing XI. మంగళవారం విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది.
 

IND vs SA Dream11 Prediction: అక్షర్, చహల్, అవేశ్ అవుట్.. టీమిండియా తుది జట్టు ఇదే! డ్రీమ్ ఎలెవన్ టీమ్..

India vs South Africa 3rd T20I Preview: సొంతగడ్డపై టీమిండియా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా రెండు టీ20 పరాజయాలను చవిచూసింది. ఫలితంగా దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-2తో భారత్‌ వెనుకంజలో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లను కోల్పోయిన భారత్‌.. సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం (జూన్ 14) విశాఖపట్నం వేదికగా రాత్రి 7 గంటలకు భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఓసారి పరిశీలిద్దాం. 

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. టీమ్ మేనేజ్మెంట్ అతడిపై నమ్మకంగా ఉంది. దాంతో వెంకటేష్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఇషాన్ కిషన్‌తో కలిసి రుతురాజ్ 3వ టీ20లోనూ ఓపెనింగ్ చేయొచ్చు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ ఒక్కో మ్యాచులో మెరిశారు. వీరందరూ సమిష్టిగా రాణించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ముఖ్యంగా కెప్టెన్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. 

అక్షర్ పటేల్‌ బ్యాట్, బంతితో అంత ప్రభావవంతంగా రాణించడం లేదు. తొలి టీ20లో అంతంతమాత్రంగా బౌలింగ్ చేసిన అక్షర్.. రెండో టీ20లో పూర్తిగా నిరాశపరిచాడు. ఒకే ఓవర్లో ఏకంగా 19 పరుగులు ఇచ్చుకున్నాడు. అలాగే బ్యాటింగ్లోనూ నిరాశపరిచాడు. దాంతో అక్షర్ స్థానంలో దీపక్ హుడాను తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. హుడా ఐపీఎల్ 2022లో మంచి ఫామ్ కనబర్చిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ రాణిస్తున్నా.. అవేశ్ ఖాన్ గాడిలో పడలేదు. దాంతో అవేశ్ స్థానంలో అర్షదీప్ సింగ్  అవకాశాలు ఉన్నాయి. పేలవ బౌలింగ్ ప్రదర్శన చేస్తున్న యుజ్వేంద్ర చహల్ స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావొచ్చు.

భారత్ తుది జట్టు (అంచనా):
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్. 

డ్రీమ్ ఎలెవన్ టీమ్:
హెన్రిచ్ క్లాసెన్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), వేన్ పార్నెల్, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, డ్వైన్ ప్రిటోరియస్, భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), హర్షల్ పటేల్, కగిసో రబాడ. 

Also Read: Covid 19 Today: 50 వేలు దాటిన యాక్టివ్ కేసులు.. దేశంలో కొవిడ్ కల్లోలం?

Also Read: Mega Recruitment: నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే  ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More