Home> క్రీడలు
Advertisement

India vs south africa: ధర్మశాల వన్డేకు వర్షం అడ్డంకి..

ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్పిస్తున్నాడు. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ తొలి వన్డే మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా.. గ్రౌండ్ అంతా నీటితో నిండిపోయింది.

India vs south africa: ధర్మశాల వన్డేకు వర్షం అడ్డంకి..

ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్పిస్తున్నాడు. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ తొలి వన్డే మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా.. గ్రౌండ్ అంతా నీటితో నిండిపోయింది. దీంతో ఇప్పటి వరకు టాస్ కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. దాదాపు 12 గంటల ప్రాంతంలో  టాస్ నిర్వహించాలని అంపైర్లు ప్రయత్నించారు. కానీ వర్షం అప్పటికి ఇంకా ఆగలేదు. 

fallbacks

మరోవైపు వాతవరణ శాఖ భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో మ్యాచ్  జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగితే  మ్యాచ్ ను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. న్యూజీలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్. . మళ్లీ జట్టుతో చేరారు. ముఖ్యంగా శిఖర్ ధావన్, హార్ధిక్  పాండ్యా తిరిగి రావడంతో జట్టు బలం పెరిగినట్లయింది. ఐతే దక్షిణాఫ్రికా జట్టును తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు.  ఆస్ట్రేలియాతో సిరీస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో కనిపిస్తోంది. 

fallbacks

Read Also: సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

అటు వర్షం కారణంగా.. మ్యాచ్ చూసేందుకు కూడా అభిమానులు  ఎవరూ రాలేదు. దీంతో గ్యాలరీలు అన్నీ క్రీడాభిమానులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More