Home> క్రీడలు
Advertisement

Ind vs NZ: టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో మార్పులు, ఇదే తుది జట్టు

Ind vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మద్య రెండవ వన్డే మ్యాచ్ రేపు అంటే నవంబర్ 27న జరగనుంది. రేపు జరగనున్న మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11లో కీలక మార్పులు జరగనున్నాయి. విఫలమైన ఆటగాళ్లకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం లేదు.

Ind vs NZ: టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో మార్పులు, ఇదే తుది జట్టు

టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇప్పుడిక రెండవ వన్డే రేపు నవంబర్ 27న జరగనుంది. ప్లేయింగ్ 11 లో కెప్టెన్ శిఖర్ థావన్ మార్పులు చేయనున్నాడు.

న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌లో పరాజయం పొందిన టీమ్ ఇండియా రెండవ మ్యాచ్‌లో ప్రతీకారం కోసం చూస్తోంది. రేపు నవంబర్ 27న జరగనున్న రెండవ వన్డేలో కీలకమార్పులు చేసేందుకు కెప్టెన్ శిఖర్ థావన్ సిద్ధమయ్యాడు. ప్లేయింగ్ 11ను మార్చేశారు. తొలి వన్డేలో శిఖర్ థావన్, శుభమన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నట్టు కన్పించారు. శిఖర్ థావన్ 72 పరగులు చేయగా శుభమన్ గిల్ 50 రన్స్ సాధించాడు. ఇక రెండవ వన్డేలో కూడా ఈ ఇద్దరే ఓపెనింగ్ వచ్చే అవకాశాలున్నాయి. 

గత కొద్దికాలంగా విరాట్ కోహ్లి లేనప్పుడు శ్రేయస్ అయ్యర్ టీమ్ ఇండియా తరపున ఆ స్థానంలో ఆడుతూ భారీగానే పరుగులు సాధిస్తున్నాడు. తొలి వన్డే మ్యాచ్‌లో 80 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా మూడవ నెంబర్‌లో దిగే అవకాశాలున్నాయి. ఇక నాలుగవ స్థానంలో టీమ్ ఇండియా కొత్త సెన్సేషన్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం లభించవచ్చు. సూర్యకుమార్ యాదవ్ అన్నివైపులా స్ట్రోక్స్ చేయగల సమర్ధుడు. 5వ స్థానంలో సంజూ శామ్సన్‌కు అవకాశం రావచ్చు. ఇక వికెట్ కీపింగ్ బాధ్యతలు రిషభ్ పంత్‌కు దక్కవచ్చు. కానీ తొలి వన్డేలో మాత్రం పంత్ ఘోరంగా విఫలమయ్యాడు.

బౌలింగ్‌లో మార్పులు

న్యూజిలాండ్‌పై జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్ బౌలింగ్‌కు ఇండియా మూల్యం చెల్లించుకుంది. ఈ ఇద్దరి స్థానంలో కుల్‌దీప్ యాదవ్, దీపక్ చాహర్‌లకు అవకాశం రావచ్చు. అటు ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింహ్‌లకు మరో అవకాశం రావచ్చు. ఆల్‌రౌండర్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయవచ్చు.

రెండవ వన్డే కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్

శిఖర్ థావన్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శామ్సన్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింహ్, ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్

Also read: FIFA WC 2022: అద్భుత విజయానికి ఊహించని నజరానా, సౌదీ ఆటగాళ్లకు రోల్స్ రాయిస్ కార్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More