Home> క్రీడలు
Advertisement

Asian Champions Trophy Final 2023: భారత్ చేతిలో మలేషియా చిత్తు.. నిమిషం వ్యవధిలో రెండు గోల్స్‌తో అద్భుత విజయం

India vs Malaysia Final Highlights: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలించింది. ఫైనల్ పోరుతో మలేషియా జట్టును 4-3తో ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆసియా ట్రోఫీ భారత్ గెలుచుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. మ్యాచ్ సాగింది ఇలా..
 

Asian Champions Trophy Final 2023: భారత్ చేతిలో మలేషియా చిత్తు.. నిమిషం వ్యవధిలో రెండు గోల్స్‌తో అద్భుత విజయం

India vs Malaysia Final Highlights: భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్‌ను నాలుగోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ పోరులో మన్‌ప్రీత్ సింగ్ సేన 4-3తో మలేషియాను మట్టికరిపించి.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆద్యంతం హైటెన్షన్‌ మధ్య జరిగిన ఫైనల్లో మూడో అర్ధభాగం ముగిసే వరకు 3-1తో వెనుకబడిన భారత్.. తరువాత పుంజుకుంది. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. 

మూడో అర్ధభాగం మరో నిమిషంలో ముగుస్తుందనగా.. 2 గోల్స్ కొట్టి ఓటమి ఖాయమనుకున్న దశలో భారత్‌ను గెలిపించారు. టీమిండియా తరఫున కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో గోల్ కొట్టగా.. వెంటనే గుర్జంత్ సింగ్ మరో గోల్ కొట్టాడు. దీంతో స్కోరు 3-3 తో సమం అయింది. 5:33 నిమిషాల్లో ముగుస్తుందనగా.. ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి వరకు అదే ఆధిక్యం కొనసాగించడంతో 4-3తో మ్యాచ్‌తోపాటు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

ముందుగా ఫైనల్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ గోల్‌గా మలిచాడు. దీంతో భారత జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అదే జోరును కంటిన్యూ చేయడంలో తడబడింది. మలేషియా అద్భుతంగా పుంజుకుని 14వ నిమిషంలో తొలి గోల్‌ను కొట్టింది. అనంతరం 18వ నిమిషంలో మరో గోల్‌తో 2-1తో ముందంజ వేసింది. మధ్యలో టీమిండియాకు గోల్ చేసే అవకాశాలు వచ్చిన సద్వినియోగం చేసుకోలేకపోయింది.

 

మలేషియా తరఫున 28వ నిమిషంలో మహ్మద్ అమీనుద్దీన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ కొట్టడంతో 3-1తో ఆధిక్యంలో దూసుకువెళ్లింది. 1-3తో భారత్ వెనుకబడిపోవడంతో భారత్ ఓటమి ఖాయమని అనుకున్నారు. కానీ మూడో అర్ధభాగం చివరి నిమిషాల్లో భారత ఆటగాళ్లు అద్భుత ఆటను ప్రదర్శించారు. నిమిషం వ్యవధిలో రెండు గోల్స్.. ఆట ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా మరో గోల్ కొట్టి.. భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. 

ఇక మూడో స్థానం కోసం జరిగిన పోరు జపాన్ 5-3తో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. జపాన్ తరఫున సెరియోమా ఓకా, రియోషి కటో, కెంటారో ఫుకుడా, షోటా యమడ, కెన్ నాగయోషి గోల్స్ కొట్టారు. కొరియా తరఫున జోంగ్‌హ్యున్ జాంగ్ రెండు గోల్స్‌లో కొట్టగా.. చియోలియన్ పార్క్ ఒక గోల్ చేశాడు.

Also Read: Bhola Shankar Collections: భోళా శంకర్ మూవీకి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్.. అస్సలు ఊహించలేరు..!  

Also Read: BJP Woman Leader Suicide: బీజేపీ నాయకుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్.. మహిళా నేత ఆత్మహత్య  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More