Home> క్రీడలు
Advertisement

Ind vs Eng: రోహిత్ ఆడేది డౌటే..? మరి ఇంగ్లాండ్‌తో టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరు..!

India vs England 5th Test: రోహిత్ శర్మకు శనివారం (జూన్ 25) యాంటిజెన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే రోహిత్ టీమిండియాతో చేరే అవకాశం ఉంటుంది.

 Ind vs Eng: రోహిత్ ఆడేది డౌటే..? మరి ఇంగ్లాండ్‌తో టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరు..!

India vs England 5th Test: టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడటంతో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు అతను ఆడేది లేనిది అనుమానంగా మారింది. జూలై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం క్వారెంటైన్‌లో ఉన్న రోహిత్.. ఆలోపు కోలుకుంటాడా.. ఒకవేళ కోలుకున్నా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అతను మ్యాచ్ ఆడటం సాధ్యమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ రోహిత్ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానాన్ని భర్తీ చేసేదెవరు అన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

కెప్టెన్‌గా విరాట్ లేదా పంత్..? 

ఒకవేళ రోహిత్ శర్మ మ్యాచ్‌కు దూరమయ్యే పక్షంలో విరాట్ కోహ్లి లేదా రిషబ్ పంత్‌లలో ఒకరికి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చేందుకు బీసీసీఐ మొగ్గుచూపవచ్చు. సాధారణంగా కెప్టెన్ మ్యాచ్‌కు దూరమయ్యే పక్షంలో వైస్ కెప్టెన్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇంగ్లాండ్‌తో జూలై 1న జరిగే టెస్టుకు బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇదే సిరీస్‌లో గత మ్యాచ్‌లలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఎడ్జ్‌బాస్టన్‌ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ విరాట్ లేదా పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. 

ఇదివరకు అన్ని ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ తర్వాత కెప్టెన్‌గా తప్పుకున్న విరాట్.. తాజా మ్యాచ్‌కు కెప్టెన్సీకి అంగీకరిస్తాడా లేడా అన్నది కూడా అనుమానమే. ఒకవేళ విరాట్ కెప్టెన్సీకి మొగ్గుచూపకపోతే రిషబ్ పంత్‌కే పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఇటీవల స్వదేశంలో పంత్ సారథ్యంలో టీమిండియా సౌతాఫ్రికాతో టీ20ల్లో తలపడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో కీలకమైన ఐదో మ్యాచ్ వర్షార్పణం కావడంతో సిరీస్ డ్రాగా ముగింది.

రోహిత్‌ ఆడే ఛాన్స్ లేదా..?

రోహిత్ శర్మకు శనివారం (జూన్ 25) యాంటిజెన్ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఒకవేళ ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగటివ్‌గా తేలితే రోహిత్ టీమిండియాతో చేరుతాడు. పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మాత్రం క్వారెంటైన్‌కే పరిమితమవుతాడు. ప్రస్తుతం ఈసీబీ అనుసరిస్తున్న కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కనీసం ఐదు రోజులు క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. అంటే.. జూన్ 30 వరకు క్వారెంటైన్ తప్పదు. ఆ మరుసటిరోజే టెస్టు మ్యాచ్ ఉంటుంది కాబట్టి.. ఆ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉండేది లేనిది అనుమానమే.
 

Also Read: India vs England: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..టెస్ట్‌ మ్యాచ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా..?

Also Read:Revanth Reddy: చేరికల జోరు..పెరుగుతున్న వర్గ పోరు! రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో రచ్చ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More