Home> క్రీడలు
Advertisement

IND vs BAN Dream11 Prediction: ఆసియా కప్‌లో ఫైనల్ ఫైట్ నేడే.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..

India Vs Sri Lanka Dream11 Team Tips and Pitch Report: ఆసియా కప్‌లో నేడు ఫైనల్ ఫైట్ జరగనుంది. భారత్-శ్రీలంక జట్ల మధ్య కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా తలపడనున్నాయి. డ్రీమ్ 11 టీమ్‌లో ఈ ప్లేయర్లను ఎంచుకోండి.
 

IND vs BAN Dream11 Prediction: ఆసియా కప్‌లో ఫైనల్ ఫైట్ నేడే.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..

India Vs Sri Lanka Dream11 Team Tips and Pitch Report: సొంతగడ్డపై ప్రపంచకప్ ముద్దాడాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. అంతకంటే ముందు భారత్‌కు ఆసియా కప్‌ ఫైనల్ రూపంలో సవాల్ ఎదురవుతోంది. ఆసియా కప్‌లో వరుసగా విజయాలతో ఫైనల్ చేరిన భారత్.. సూపర్-4లో నామామత్రమైన బంగ్లాదేశ్‌తో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో శ్రీలంకతో నేడు జరిగే ఫైనల్‌కు పకడ్బందీగా రెడీ అవుతోంది. బంగ్లాతో పోరుకు సీనియర్లకు విశ్రాంతినివ్వగా.. తిరిగి తుది జట్టులోకి రానున్నారు. అక్షర్ పటేల్ గాయాల కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. అటు పాకిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక.. రెట్టించిన విశ్వాసంతో ఫైనల్ పోరుకు రెడీ అయింది. భారత్‌ను ఓడించి.. వరుసగా రెండోసారి ఆసియా కప్‌ విజేతగా నిలవాలని చూస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా.. 

మరోసారి స్పిన్నర్లకు పండగే..

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం. ఆసియా కప్‌లో జరిగిన అన్నీ మ్యాచ్‌ల్లోనే వాళ్లదే హవా. స్పిన్నర్లు 70 శాతం ప్రభావం చూపితే.. పేసర్లు 30 శాతం వికెట్లు పడగొట్టారు. షాట్ ఆఫర్‌లో టర్న్, బౌన్స్ కారణంగా ఈ ట్రాక్‌లో స్పిన్నర్లు వికెట్లు పడగొడుతున్నారు. బ్యాట్స్‌మెన్ కూడా పరుగుల వరద పారిస్తున్నారు. బ్యాటర్లు పిచ్ బ్యాటింగ్ స్వభావాన్ని ఉపయోగించుకుని భారీ స్కోర్ చేయగలరు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

స్ట్రీమింగ్ వివరాలు ఇలా..

==> వేదిక: ఆర్.ప్రేమదాస స్టేడియం, శ్రీలంక
==> సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
==> స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ మొబైల్ వర్షన్‌లో ఫ్రీగా చూడొచ్చు.

తుది జట్లు ఇలా (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్/తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలగే, సహన్ అరాచ్చిగే, ప్రమోద్ మధుషన్, మతీషా పతిరణ

డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..

వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, కుశాల్ మెండిస్
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పాతుమ్ నిస్సాంక 
ఆల్ రౌండర్లు – ధనంజయ డిసిల్వా, హార్దిక్ పాండ్యా 
బౌలర్లు - జస్ప్రీత్ బుమ్రా, మతీషా పతిరణ, కుల్దీప్ యాదవ్ (వైస్ కెప్టెన్)

 

Read More